అల్లు అరవింద్ బిజినెస్: తక్కువ పెట్టుబడితో జాక్ పాట్ లాభాలు!
ప్రస్తుతం గీతా ఆర్ట్స్, GA2 పిక్చర్స్ బ్యానర్‌పై వరుసగా కొత్త సినిమాలు నిర్మిస్తున్నారు. కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతోపాటు ఇలా డబ్బింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగంలో భిన్నమైన సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు.
By: M Prashanth | 29 July 2025 12:55 PM ISTటాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్న ఈ సంస్థ ఎప్పుడూ తనదైన స్టైల్ లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొత్తదనం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇతర భాషల సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడంలో గీతా ఆర్ట్స్ కు సూపర్ జడ్జ్మెంట్ ఉంది. హిట్ అవుతాయన్న అనుమానం వచ్చినా రిస్క్ తీసుకొని, ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఆధ్యాత్మిక నేపథ్యంలో వచ్చిన సినిమాలతో ఈ సంస్థకి మంచి లాభాలు వచ్చాయి. ముఖ్యంగా తక్కువ రేట్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ తో జాక్ పాట్ లాభాలే అందుకున్నారు.
ప్రస్తుతం గీతా ఆర్ట్స్, GA2 పిక్చర్స్ బ్యానర్‌పై వరుసగా కొత్త సినిమాలు నిర్మిస్తున్నారు. కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతోపాటు ఇలా డబ్బింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగంలో భిన్నమైన సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఆధ్యాత్మిక కథలు, మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలను సైతం టెస్ట్ చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నారు.
కాంతారా నుంచి..ఛావా
ఒకప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలే మేజర్‌గా తీస్తూ వచ్చిన గీతా ఆర్ట్స్.. గతంలో కన్నడ హిట్ ‘కాంతారా’ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. ఆ చిత్రానికి కమర్షియల్ యాక్షన్‌తోపాటు, ఆధ్యాత్మిక కాన్సెప్ట్ ఉన్నా, లోతైన భక్తి అంశమే సినిమాను పాజిటివ్‌గా నిలబెట్టింది. అ సినిమాతో దాదాపు 50 కోట్ల లాభాలు అందుకున్నారు. హిందీలో బ్లాక్‌బస్టర్ అయిన ‘ఛావా’ వంటి చారిత్రక చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్ చేయడం గీతా ఆర్ట్స్ కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. తెలుగు ప్రేక్షకులు హిస్టారికల్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించకపోయినా, ఇలాంటి ప్రయత్నాలకు బ్రాండ్ విలువ పెరిగింది.
మహావతార్ నర్సింహ
లేటెస్ట్ గా రూపొందిన ‘మహావతార్ నర్సింహ’ అనే డివోషనల్ యానిమేటెడ్ మూవీని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసి మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారు. తెలుగులో విడుదల చేశారు. యానిమేషన్, 3డి ఎఫెక్ట్స్ తో చేసిన ఈ సినిమా సరికొత్తగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికత ఆధారంగా ఉండే కథలను తీసుకుని ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ముందుకు రావడం లేదు. కానీ గీతా ఆర్ట్స్ మాత్రం ఆ మార్గాన్ని కొనసాగిస్తూ సక్సెస్ సాధించింది. ‘మహావతార్ నర్సింహ’ లేటెస్ట్ కలెక్షన్లు చూస్తేనే ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిందని అర్థమవుతుంది. ప్రమోషన్ ఇంకా స్ట్రాంగ్‌గా నిర్వహించి ఉంటే, మరింత భారీగా కలెక్షన్లు వచ్చేవి అని సినీ వర్గాల్లో విశ్లేషణ వినిపిస్తోంది. ఇదే సమయంలో
మార్కెట్‌లో రెస్పాన్స్
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద సినిమాలే హవా చూపిస్తున్నప్పటికీ, భక్తి కథలు, చారిత్రక చిత్రాలు కూడా స్పేస్ సంపాదించుకోవచ్చన్న కాన్ఫిడెన్స్ గీతా ఆర్ట్స్ కలిగిస్తోంది. డబ్బింగ్ సినిమాలు భారీగా వర్కౌట్ కావడం, కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతూ ఉండడం.. ఇలా అనేక మార్పులు గీతా ఆర్ట్స్ చేతుల్లోనే ఉన్నాయి. ఫ్యూచర్‌లో మరిన్ని భిన్నమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశాలు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ‘కాంతారా’, ‘మహావతార్ నర్సింహ’, ‘ఛావా’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న గీతా ఆర్ట్స్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, భక్తి, చారిత్రిక అంశాలతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ, వారి అభిరుచులను మరింత విస్తృతంగా అన్వేషిస్తోంది. ఇకపై ఇలాంటి ప్రయోగాలు మరిన్ని రావచ్చని అర్ధమవుతోంది.
