ఎన్టీఆర్ బర్త్డే... 25 ఏళ్ల కెరియర్ జర్నీపై గీతా ఆర్ట్స్, శ్రేయాస్ మీడియా స్పెషల్ వీడియో రిలీజ్!
అంతేకాదు విదేశాలలో ఉన్న నందమూరి అభిమానులు కూడా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
By: Madhu Reddy | 20 May 2026 11:21 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకుని.. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ని దక్కించుకున్న మ్యాన్ ఆఫ్ మోసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈరోజు 43వ పుట్టినరోజును ఆయన అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ నుంచి పలు నిర్మాణ సంస్థలు, మీడియా సంస్థలతోపాటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్..
అంతేకాదు విదేశాలలో ఉన్న నందమూరి అభిమానులు కూడా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అలాగే ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయాస్ మీడియా ఎన్టీఆర్ 25 సంవత్సరాల సినీ కెరియర్ లో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు, సినిమా విశేషాలన్నింటినీ ఒకచోట చేర్చి.. ఒక అద్భుతమైన వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ సినీ జర్నీని చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
గీత ఆర్ట్స్ స్పెషల్ విషెస్..
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకున్న గీతా ఆర్ట్స్ నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. హ్యాపీ బర్తడే మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ అంటూ అధికారికంగా వదిలిన ఈ స్పెషల్ మ్యాషప్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనలోని నవరసాలను.. ఆయనకున్న అసాధారణమైన క్రేజ్ ను అలాగే నిత్యం ఏదో చేయాలి అనే ఆయన తపనను ఎలివేట్ చేస్తూ ఈ వీడియోని చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. నటనలో ఎన్టీఆర్ ను కొట్టే వాడే లేడు అనే రేంజ్ లో ఉన్న ఈ విజువల్స్ , అటు గీత ఆర్ట్స్ పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు రెండు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రేయస్ మీడియా మ్యాషప్ వీడియో..
ఇక అలాగే శ్రేయాస్ మీడియా కూడా విడుదల చేసిన మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ మ్యాషప్ వీడియో కూడా అటు యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది.ముఖ్యంగా ఎన్టీఆర్ తన సినిమాలలో పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, ఆయన సినీ ప్రస్థానంలోని ఐకానిక్ మాస్ సీన్లతో పాటు వెండితెరపై ఆయన వేసిన మైండ్ బ్లోయింగ్ స్టెప్పులను అన్నింటినీ కలగలిపి ఒక వీడియోని అత్యంత అద్భుతంగా డిజైన్ చేసి రిలీజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న హై వోల్టేజ్ మ్యూజిక్ కి ఎన్టీఆర్ ఎలివేషన్స్ సీన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు ..హ్యాపీ బర్తడే ఎన్టీఆర్ అంటూ శ్రేయాస్ మీడియా విడుదల చేసిన ఈ వీడియో అటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ట్రెండ్ అవుతోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా ఈ రెండు సంస్థలు రిలీజ్ చేసిన ఈ వీడియోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
