సందీప్ కిషన్ ఫాంటసీ వరల్డ్ లోకి కొత్త బ్యూటీ!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లోనే ఒక భారీ ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది.
By: M Prashanth | 14 Oct 2026 8:02 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లోనే ఒక భారీ ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న 'కరికాల' మూవీ పూజా కార్యక్రమాలు అక్టోబర్ 15న ఎంతో గ్రాండ్ గా జరగబోతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మొదలుకాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఇండస్ట్రీ సర్కిల్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
గతంలో శంబాల లాంటి డిఫరెంట్ అటెంప్ట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ యుగంధర్ ముని ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా డిజైన్ చేసేందుకు ప్లాన్ చేశారు. శంబాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కథను సిద్ధం చేశారు.
ఇక ఈ ఫాంటసీ వరల్డ్ లో కాస్టింగ్ కూడా గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాగా, లేటెస్ట్ గా మరో బ్యూటీ గాయత్రి భరద్వాజ్ ను టీమ్ లోకి ఆహ్వానించారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచేలా ఉంది. గాయత్రి ఇందులో ఒక అతి ముఖ్యమైన పాత్రలో నటించనుందని యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.
సాంకేతికంగా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేయడానికి టీమ్ అంతా రెడీ అయింది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ తో ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇలాంటి భారీ కాన్వాస్ ఉన్న కథకు యువ సెన్సేషన్ శ్రీచరణ్ పాకాల లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తుండటం సినిమాకు ఇంకో మేజర్ ప్లస్ పాయింట్.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన అంశం రిలీజ్ డేట్స్. సినిమా షూటింగ్ మొదలుకాకముందే మేకర్స్ ఏకంగా రెండు భాగాల రిలీజ్ తేదీలను లాక్ చేసి అనౌన్స్ చేసేశారు. కరికాల మొదటి చాప్టర్ 2027 జూలై 2న థియేటర్లలోకి రానుండగా, రెండో చాప్టర్ అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నీ కరికాల చుట్టూ ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఫాంటసీ ఎలిమెంట్స్ కు ఇండియన్ ఎమోషన్స్ ను జోడించి అద్భుతమైన కథనంతో ఈ సినిమా రానుంది. ఇక భారతీయ ప్రేక్షకులకు కచ్చితంగా స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
