శ్రీ విష్ణుకు ఎలివేషన్ మామూలుగా లేదుగా!
ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్‌లుగా నటించారు. కీలక పాత్రలో జేడీ చక్రవర్తి నటించగా పవన్ సాధినేని సమర్పణలో కశ్యప్ శ్రీనివాస్ రూపొందించారు.
By: Ravindar Gorantla | 28 April 2026 6:32 PM ISTయంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన మూవీ `గాయపడ్డ సింహం`. యుఎస్ వెళ్లాలనుకునే ఓ యువకుడి విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో ఆద్యంత వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్‌కు ముందు ప్రాఫిట్‌లో ఉన్న ఈ మూవీపైఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్‌లుగా నటించారు. కీలక పాత్రలో జేడీ చక్రవర్తి నటించగా పవన్ సాధినేని సమర్పణలో కశ్యప్ శ్రీనివాస్ రూపొందించారు.
సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ని ఫాస్ట్ అప్ చేసింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై యుద్ధం ప్రకటించే యువకుడి కథగా దీన్ని ఆత్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ కారణంగా ఇండియాకు తిరిగి వచ్చే యువకుడిగా తరుణ్ భాస్కర్ నటించాడు.
ఆద్యంతం వినోదాత్మకంగా ఓ సెటైరికల్ మూవీగా రూపొందించిన ఈ సినిమాలోని కొన్ని కీలక ఘట్టాల్లో సలార్, కేజీఎఫ్‌లోని కీ సీన్స్‌ని కామెడీ కోసం కాపీ చేశారు. అయితే ఇందులోని ఓ కీలక అతిథి పాత్రని మాత్రం ట్రైలర్ ఎండ్‌లో రివీల్ చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశారు. ఓ పక్క జేడీ జక్రవర్తిని సత్య అంటూ రంగంలోకి దించేసిన టీమ్ ట్రైలర్ ఎండింగ్‌లో హీరో శ్రీవిష్ణుని రంగంలోకి దించేసి సర్‌ప్రైజ్ ఇచ్చేశారు.
అంతేనా ఓ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో `గాయపడ్డ సింహం` చిన్న సినిమా కాదు పెద్ద సినిమా అని క్లారిటీ వచ్చేసింది. `కేజీఎఫ్` పాపులర్ డైలాగ్‌ని అటు ఇటుగా మార్చి శ్రీవిష్ణుకు ఇచ్చిన ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంది. శక్తి వంతమైన ప్రజలు..శక్తివంతమైన ప్రదేశాల నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది` అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్స్‌కు ప్రాణం పోస్తూ శ్రీవిష్ణు ఇచ్చిన ఎంట్రీ మామూలుగా లేదు. మోస్ట్ అన్ ప్రెడిక్టెబుల్, యాంటిసీ పేటెడ్ మల్టీస్టారర్ మూవీ ఇదరి అంతా నెట్టింట ప్రచారం చేస్తున్నారు.దీంతో గాయపడ్డ సింహం ప్రస్తుతం నెటంటింట వైరల్‌గా మారింది.
