Begin typing your search above and press return to search.

స్టార్ వార‌సుడు ఓపెన్ విమర్శలు.. నచ్చింది రెండు విషయాలే!

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన `ది ప్యారడైజ్` థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తయింది.

By:  Srikanth Kontham   |   25 Oct 2026 8:13 PM IST
స్టార్ వార‌సుడు ఓపెన్ విమర్శలు.. నచ్చింది రెండు విషయాలే!
X

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన `ది ప్యారడైజ్` థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నా? చాలా వ‌ర‌కూ రివ్యూస్ నిజాయితీగానే వ‌చ్చాయి. ఆ ర‌కంగా సినిమాకు ఇది పాజిటివ్ సైన్ గా చెప్పొచ్చు. ఈ విష‌యాన్ని నాని కూడా బ‌హిరంగంగానే అంగీక‌రించారు. ఇటీవల చిత్రం ఓటీటీ అభిమానుల‌ దృష్టిని ఆకర్షించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ చిత్రానికి 1 స్టార్ రేటింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

గౌతమ్ సినిమా రివ్యూస్ పంచుకునే పాపులర్ ప్లాట్‌ఫామ్ `లెటర్‌బాక్స్‌` లో తన అభిప్రాయాన్ని రాస్తూ `సినిమాలోని సినిమాటోగ్రఫీ ఎమోషనల్ సీన్లలో నటన మాత్రమే నచ్చాయి. మిగతాది ఏదీ ఆకట్టుకోలేదు. చాలా నిరాశపరిచింది. ఎడిటింగ్ కూడా దారుణంగా ఉంది` అని రాసారు. సాధారణ ప్రేక్షకుడిగా సినిమా చూసి నిజాయితీగా త‌న‌ అభి ప్రాయాన్ని బయటపెట్టడం గౌతమ్ నైజం. గతంలో కూడా మహేష్ నటించిన `గుంటూరు కారం` సహా అనేక చిత్రాలకు ఆయన నిష్పాక్షికంగానే రేటింగ్‌లు ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే? ఏ సినిమాపై అయినా ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాన్ని, విమర్శను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. గౌతమ్ సెలబ్రిటీ త‌నయుడు అయినా? ప్యాషనేట్ మూవీ లవర్ వర్గంలో తన అభిప్రాయాన్ని పంచుకోవడం పూర్తిగా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ. అయితే ఒక స్టార్ హీరో కొడుకు మరొక అగ్ర హీరో సినిమాపై ఇలాంటి కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంలో ఆశ్చర్యం లేదు.

అదే సమయంలో ఈ వార్తల ప్రామాణికతపై కూడా అనుమానం వ్యక్తమవుతోంది. నిజంగానే ఆ లెటర్‌బాక్స్ ప్రొఫైల్ గౌతమ్‌దేనా? లేక ఆయన పేరుతో నడుస్తున్న ఫేక్ అకౌంటా? అనే ప్రశ్నలు ఉత్పన్న మ‌వుతున్నాయి. గతంలో రివ్యూలు వైరల్ అయినప్పుడు గౌత‌మ్ సోషల్ మీడియా బయో నుండి లింక్‌ను తొలగించి ఆ తర్వాత మళ్లీ జోడించడంపై కూడా నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

మొత్తానికి `ది ప్యారడైజ్` విడుదలై నెల రోజులు దాటిన తర్వాత కూడా ఓటీటీ రిలీజ్ .. గౌతమ్ రేటింగ్ నెపంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. గౌతమ్ అభిప్రాయం జెన్యూనా లేదా ఆ అకౌంట్ వెనుక వేరే ఏమైనా ఉందా అనే సందేహాలు ఉన్నా? ఒక సినిమా ఫలితాన్ని ఆడియన్స్ ఇచ్చే తీర్పే నిర్ణయిస్తుందనేది జగమెరిగిన సత్యం.