రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!
మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ‘రామాయణ’ సినిమాకు 5కి 4.5 రేటింగ్ ఇచ్చాడు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా మెప్పించాడని, రావణుడిగా యష్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమని ప్రశంసించాడు. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా ఆకట్టుకున్నాయని తెలిపాడు. గతంలో ‘టాక్సిక్’కు హాఫ్ స్టార్ ఇచ్చిన గౌతమ్.. ఇప్పుడు యష్ సినిమాకు ఇంత రేటింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
By: Priya Chowdhary Nuthalapti | 13 Nov 2026 12:46 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని.. సినిమాలకు ఎప్పుడెప్పుడు రివ్యూ ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమా విడుదలయితే మహేష్ బాబు ట్విట్టర్ లో ట్వీట్ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడేమో మహేష్ బాబు కొడుకు రివ్యూల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సినిమా రివ్యూల విషయంలో మాత్రం మహేష్ బాబుకు తగ్గ కొడుకు అని రుజువు చేసుకుంటున్నారు..గౌతమ్.
ఈ క్రమంలో గౌతమ్ తాజాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ సినిమాపై స్పందించాడు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏకంగా 5కి 4.5 రేటింగ్ ఇవ్వడం ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
రామాయణ చిత్రాన్ని చూసిన గౌతమ్ దాని మేకింగ్, విజువల్స్, కథనం, దర్శకత్వంపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపాడు. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ ఇతిహాస కథను తెరపై చూపించిన విధానం బాగుందని తన రివ్యూలో పేర్కొన్నాడు. స్క్రీన్‌ప్లే కూడా ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సినిమా తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని 4.5 స్టార్ రేటింగ్‌తో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో మెప్పించాడని గౌతమ్ ప్రశంసించాడు. మరోవైపు రావణుడిగా యష్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన చాలా అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
నిజానికి గౌతమ్ ఘట్టమనేని సినిమా రివ్యూలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతడు ఇచ్చిన రేటింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా యష్ నటించిన టాక్సిక్ సినిమాకు కేవలం హాఫ్ స్టార్ మాత్రమే ఇచ్చిన గౌతమ్ ఇప్పుడు.. అతని రామాయణం సినిమాకి 4.5 స్టార్స్ ఇవ్వడం విశేషం.
