బిగ్ బాస్ విజేత అతనే.. ప్రైజ్ మనీ ఎంతంటే?
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Madhu Reddy | 8 Dec 2025 9:22 AM ISTవరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ పేరిట ప్రారంభమైన ఈ షోని హిందీలో బిగ్ బాస్ పేరిట తొలిసారి ఆరంభించారు. మొదటి షో కి భాషతో సంబంధం లేకుండా విపరీతమైన క్రేజ్ లభించడంతో అన్ని భాషలలో కూడా ఈ షోని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, టీవీ , సినిమా రంగంలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలను ఒకే చోట దాదాపు మూడు నుండి నాలుగు నెలల పాటు ఒకే ఇంట్లో ఉంచి.. వారికి భిన్నవిభిన్నమైన టాస్కులు పెట్టి.. గెలిచిన వారికి లక్షల రూపాయల ప్రైజ్ మనీని బహుమతిగా ఇస్తున్నారు.
ఇకపోతే తెలుగులో కూడా ఈ షో 9వ సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో విజేత ఎవరు? ఆ షో విజేతకి ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చారు? అనే విషయం వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు బిగ్ బాస్ లో కాదు హిందీ బిగ్ బాస్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ షో ప్రస్తుతం హిందీలో 19వ సీజన్ కూడా నిన్నటితో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే విజేతగా ఎవరు నిలిచారు? అనే విషయం వైరల్ గా మారుతోంది.
బిగ్ బాస్ 19 హిందీ ట్రోఫీని ప్రముఖ టీవీ నటుడు గౌరవ్ కన్నా సొంతం చేసుకున్నారు. ఫర్హానా భట్ రన్నరప్ గా నిలిచారు. అంతకుముందు హోస్ట్ సల్మాన్ ఖాన్ వీరిద్దరినీ ఫైనలిస్టులుగా ప్రకటించారు. ఆపై ఖన్నా చేతిని పైకెత్తగా విన్నర్ ఎవరో తెలిసిపోయింది. పాజిటివ్ నెస్ , టాస్క్ లో నేర్పరితనం, వివాదాలకు దూరంగా ఉండటమే ఆయన గెలుపుకు కారణమైనట్లు సోషల్ మీడియాలో అతని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు . ఇకపోతే ప్రైజ్ మనీగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ట్రోఫీతో రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ లభించింది . ఇక సీజన్-19 విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నాకు అభిమానులు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా విజేతను ప్రకటించిన తర్వాత ఇదే ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. విషయంలోకి వెళ్తే.. గతంలో బిగ్ బాస్ షో కి ధర్మేంద్ర వచ్చిన వీడియోని అక్కడ ప్రదర్శించగా.. సల్మాన్ ఖాన్ దానిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. "మనం హీ - మ్యాన్ ను కోల్పోయాము..ఆయన కంటే గొప్పవారు ఇంకొకరు లేరు". అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
