బిగ్ బాస్ 9.. గౌరవ్ ఎలిమినేషన్ రీజన్స్ ఏంటి..?
బిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం ఆదివారం ఎపిసోడ్ లో గౌరవ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు.
By: Ramesh Boddu | 17 Nov 2025 9:51 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం ఆదివారం ఎపిసోడ్ లో గౌరవ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. అందులో భాగంగానే శనివారం నిఖిల్ ని ఎలిమినేట్ చేయగా ఆదివారం ఎపిసోడ్ లో గౌరవ్ ని బయటకు పంపించారు. ఐతే గౌరవ్ ఎలిమినేషన్ తో ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ అందరు బయటకు వచ్చేశారు. ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి రోజు హౌస్ లోకి వెళ్లారో వాళ్లే హౌస్ లో ఉన్నారు.
అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కళ్యాణ్, డీమాన్ పవన్..
బిగ్ బాస్ సీజన్ లో అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కళ్యాణ్, డీమాన్ పవన్ హౌస్ లో కొనసాగుతుండగా రెండు వారాల తర్వాత వచ్చిన మరో కామనర్ దివ్య కూడా హౌస్ లో ఉంది. సెలబ్రిటీస్ గా వచ్చిన తనూజ, ఇమ్మాన్యుయెల్, రీతు చౌదరి, సంజన, సుమన్ శెట్టి, భరణి ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఐతే నిఖిల్, గౌరవ్ ఇద్దరు వైల్డ్ కార్డ్స్ గా వచ్చి ఇద్దరు ఒకే వారం ఎలిమినేట్ అయ్యారు. అంతేకాదు ఇద్దరు హౌస్ లో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.
నిఖిల్ ఎలా ఐతే పెద్దగా కనిపించకుండా హౌస్ లో ఉన్నాడు గత వారం టాస్క్ లు ఆడినా జరగాల్సిన నష్టం జరిగింది. ఇక గౌరవ్ స్ట్రాంగ్ అనిపించినా కూడా మొదట్లో ఉన్న ఫోకస్ గత రెండు వారాల్లో కనిపించలేదు. అదీగాక తను ఏదైనా టాస్క్ లో ఉన్నప్పుడు అది గ్రూప్ టాస్క్ అయినా ఓడిపోతే అవతల వాళ్లదే తప్పు అన్నట్టుగ సెల్ఫిష్ గా ప్రవర్తించాడు. మాట్లాడితే కెమెరా ముందుకు వచ్చి తాను సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టానని సెల్ఫ్ డబ్బా కొట్టేస్తున్నాడు. అదే ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తుంది.
ప్రతి విషయాన్ని పెద్దది చేస్తూ కంటెంట్ ఇవ్వాలని చూశాడు కానీ..
వైల్డ్ కార్డ్ గా వచ్చి కెప్టెన్ కూడా అయిన గౌరవ్ ఆ తర్వాత ఫోకస్ అవుట్ అయ్యాడు. ప్రతి విషయాన్ని పెద్దది చేస్తూ కంటెంట్ ఇవ్వాలని చూశాడు కానీ అతను అది అతనికే రివర్స్ అయ్యేలా చేసింది. ఫైనల్ గా గౌరవ్ ఎలిమినేషన్ కి కూడా అది దారి తీసింది. నిన్న ఎపిసోడ్ లో గౌరవ్, దివ్య చివరగా ఉండగా గార్డెన్ ఏరియాలో వాళ్లలో గౌరవ్ ఎగ్జిట్ అని వచ్చింది.
ఐతే నాగార్జున తనూజ దగ్గర ఉన్న గోల్డెన్ డైమండ్ వాడి గౌరవ్ ని సేవ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అవుతుందని అన్నారు. ఐతే తనూజ మాత్రం ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే తాను వెళ్తానని వెళ్లింది. తన గోల్డెన్ డైమండ్ పవర్ పోతుందని తెలిసినా కూడా ఆమె వాడుకోవాలని అనుకోలేదు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ అందరు ఎలిమినేట్ అయ్యారు. సీజన్ లో ఫైర్ స్టోర్మ్ గా వచ్చిన వీళ్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
