Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో మిరాయ్ రాముడు... ఈ డీటైల్స్ తెలుసా..?

ముఖ్యంగా మిరాయ్ చివర్లో రెండు నిమిషాల పాటు వచ్చే రాముడి సన్నివేశాలు థియేటర్ లో విజిల్స్ పడేలా చేస్తున్నాయి.

By:  Ramesh Boddu   |   15 Sept 2025 1:00 PM IST
ట్రెండింగ్ లో మిరాయ్ రాముడు... ఈ డీటైల్స్ తెలుసా..?
X

జ సజ్జ మిరాయ్ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై మంచి టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు సినిమాలోని విజువల్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మిరాయ్ చివర్లో రెండు నిమిషాల పాటు వచ్చే రాముడి సన్నివేశాలు థియేటర్ లో విజిల్స్ పడేలా చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో మిరాయ్ లో రాముడు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో మిరాయ్ లో రాముడిగా నటించింది ఎవరు.. అతని డీటైల్స్ ఏంటని తెగ వెతికేస్తున్నారు. ఫైనల్ గా అతని పూర్తి డీటైల్స్ బయటకు వచ్చాయి. మిరాయ్ సినిమా రిలీజ్ ముందు సినిమాలో రెండు సర్ ప్రైజ్ లు ఉన్నాయని తేజ సజ్జ సస్పెన్స్ లో పెట్టాడు. అదేంటా అని సినిమా చూసే సరికి రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఒకటి కాగా రెండోది పార్ట్ 2 లో విలన్ గా రానాకి లీడ్ ఇచ్చారు.

ఐతే మిరాయ్ లో రాముడి సీన్స్ హైలెట్ అయ్యాయి. అది ఒక స్టార్ హీరో చేసి ఉంటే మరోలా ఉండేది కానీ రాముడిగా ఎవరు చేసినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మిరాయ్ లో కూడా అంతే.. ఐతే మిరాయ్ లో రాముడిగా నటించింది బాలీవుడ్ యాక్టర్ గౌరవ్ బోరా. ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ అతనిది. ఐతే మాస్ కమ్యునికేషన్స్ పూర్తైన గౌరవ్ బోరా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఢిల్లీ వెళ్లి అక్కడ థియేటర్ గ్రూప్ లో ఐదేళ్ల పాటు ఎక్స్ పీరియన్స్ సాధించాడు. ఆ నెక్స్ట్ హిందీలో నాటకాలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్ లు చేస్తూ వచ్చాడు.

స్మాల్ స్క్రీన్ పై అతను ఛాన్స్..

అలా స్మాల్ స్క్రీన్ పై అతను ఛాన్స్ తెచ్చుకున్నాడు. అలా బుల్లితెర మీద చేస్తూ మోడల్ గా చాలా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నాడు గౌరవ్ బోరా. ఐక్యూబ్, బజాజ్ ఫ్రీడం, టాటా క్యాపిటల్, సపోలా ఆయిల్ లాంటి ప్రకటనల్లో గౌరవ్ బోరా నటించారు. మిరాయ్ లో అతను కనిపించినంత సేపు మ్యాజిక్ చేశాడు. అవతార పురుషుడు రాముడి పాత్రలో ఆయన మెప్పించాడు. కచ్చితంగా మిరాయ్ తర్వాత కూడా తెలుగులో అతనికి మంచి రోల్స్ దక్కే ఛాన్స్ ఉంటుంది. తేజ సజ్జ మిరాయ్ లో విలన్ గా మంచు మనోజ్ నటించాడు. ఈ సినిమాలో మనోజ్ యాక్టింగ్ కూడా అదరగొట్టేసింది. కార్తీక్ టేకింగ్ తో పాటు మ్యూజిక్ కూడా ప్లస్ అవ్వడంతో మిరాయ్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది.