Begin typing your search above and press return to search.

అషికా రంగనాథ్ గతవైభవం టీజర్.. ఇదేదో కొత్తగా ఉందే..

ఇందులో అషికా దుష్యంత్ మధ్య పలు సన్నివేశాలు చూపించారు. సినిమా స్టోరీ లవ్ ట్రాక్ అండ్ రివెంజ్ స్టోరీలా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు కథలు సాగనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.

By:  M Prashanth   |   30 Sept 2025 1:00 AM IST
అషికా రంగనాథ్ గతవైభవం టీజర్.. ఇదేదో కొత్తగా ఉందే..
X

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమా గతవైభవ. ఈ సినిమాను దర్శకుడు సింపల్‌ తెరకెక్కించాడు. అషికాతోపాటు ఇందులో దుశ్యంత్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిన్న మేకర్స్ కన్నడ టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా తెలుగు వెర్షన్ టీజర్ ను వదిలారు.

గతవైభవ టీజర్ 1.30 నిమిషాల నిడివితో ఉంది. ఈ సినిమా కథ పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో ఆధ్యాత్మికం, రూరల్ బ్యాక్ డ్రాప్ తోపాటు మరిన్ని జనార్ లు టచ్ చేసినట్లు తెలుస్తోంది. నీవు ఏ జన్మలో పుట్టినా నీకు గర్భసంగమమం కలుగదు అంటూ అనామదేవుడు శాపంతో టీజర్ ప్రారంభమైంది. సినిమా కోసం ఇంకో ప్రపంచాన్ని సృష్టించినట్లు టీజర్ చూస్తే తెలిసిపోతుంది.

ఇందులో అషికా దుష్యంత్ మధ్య పలు సన్నివేశాలు చూపించారు. సినిమా స్టోరీ లవ్ ట్రాక్ అండ్ రివెంజ్ స్టోరీలా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు కథలు సాగనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఒక స్టోరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండగా.. మరొకటి దేవకన్యగా ఇంకో లోకంలో సాగే కథగా తెలుస్తోంది. ఓవరాల్ గా అయిచే కథాంశం కాస్త కొత్తగా ఉంది. డైరెక్టర్ ప్రేక్షకులకు ఏదో చెప్పాలని గట్టిగానే అనుకుంటున్నట్లు టీజర్ లో రిలీల్ అయింది.

విజువల్స్, గ్రాఫిక్స్ ఉన్నంతలో బాగానే సెట్ చేశారు. ముఖ్యంగా స్టోరీ డిమాండ్ మేరకు ఇంకో లోకాన్ని డిజైన్ చేశారు. దానికి బాగానే ఖర్చు అయ్యిుంటుంది. కానీ గతవైభవం ఆడియెన్స్ కు కొత్త అనుభూతి ఇవ్వడం పక్కా అని టీజర్ చూసిన నెటిజన్లు అనుకుంటున్నారు. చిత్రంలో ప్రేమతో పాటు వినోదానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు రీసెంట్ గా డైరెక్టర్ సింపల్ చెప్పారు.

అలాగే సినిమాకు సంబంధించి నాలుగు పాటలు కూడా కొన్ని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో షూట్ చేసినట్లు చెప్పారు. హీరో దుశ్వంత్, హీరోయిన్‌ ఆశికా రంగనాథ్‌ పాత్రలు టీజర్ లో మెయిన్ అట్రాక్షన్ గా ఉన్నాయి. హీరో దుశ్వంత్‌ నటన గతంలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా ఉందని, డైరెక్టర్ సింపల్ తెలిపారు. ఇక సినిమా జూడా స్యాండి సంగీతం అందించారు. మరి సినిమా ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ ఆవుతుందో చూడాలి.