'గత వైభవం' ట్రైలర్.. నాలుగు యుగాల ప్రేమకథ
ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ఏకంగా నాలుగు వేర్వేరు యుగాల్లో సాగే ఒక ప్రేమకథ అని అర్థమవుతోంది.
By: M Prashanth | 10 Nov 2025 12:08 PM ISTఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక భారీ ఫాంటసీ ఎపిక్‌ను శాండిల్‌వుడ్ ఆడియన్స్‌కు అందించేలా ఉంది. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన 'గత వైభవం' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ఏకంగా నాలుగు వేర్వేరు యుగాల్లో సాగే ఒక ప్రేమకథ అని అర్థమవుతోంది.
ఈ సినిమా ట్రైలర్ ఒక టైమ్ ట్రావెల్ తరహాలో ఉంది. పోర్చుగీస్ పాలన కాలం, ఆ తర్వాత దేవలోకం, ఒక చారిత్రాత్మక రాచరిక యుగం, చివరకు నేటి మోడ్రన్ కాలం.. ఇలా నాలుగు కాలాలను టచ్ చేస్తూ ఈ కథ సాగుతుంది. ఈ నాలుగు యుగాల్లోనూ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, వారిని వెంటాడుతున్న అడ్డంకులు వంటివి హైలెట్ అవుతున్నాయి.
ఇక ఈ కాలంతో వారి ప్రేమ ఎలా సాగింది అనే అంశాన్ని తెరపై చూపించనున్నట్లు అర్ధమవుతుంది. ఈ విజువల్ వండర్‌కు సుని దర్శకత్వం వహించారు. పురాణాలు, పీరియడ్ డ్రామా, ఫాంటసీ.. ఈ మూడు జానర్లను బ్యాలెన్స్ చేస్తూ ఆయన రాసుకున్న కథ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగా హైలెట్ అయ్యింది.
ప్రతి యుగానికి తగ్గట్టుగా సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌లో చూపించిన డీటెయిలింగ్ ఆడియన్స్‌కు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. విలియం జె డేవిడ్ సినిమాటోగ్రఫీ, జుడా సంధ్య బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఆ ఎపిక్ ఫీల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. హీరో దుష్యంత్, హీరోయిన్ ఆషికా రంగనాథ్ నాలుగు యుగాలకు తగ్గట్టుగా వేర్వేరు గెటప్స్‌లో చాలా సహజంగా కనిపించారు.
వారి మధ్య కెమిస్ట్రీ ఈ అద్భుత కథలో బలంగా ఉందనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో, 'హనుమాన్' లాంటి బ్లాక్‌బస్టర్‌ను ప్రొడ్యూస్ చేసిన 'ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్' (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి) రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాలు, నార్త్ అమెరికా, కెనడాలో ఈ సినిమాను వాళ్లే గ్రాండ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ ఫాంటసీ లవ్ స్టోరీని ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
