Begin typing your search above and press return to search.

'గరివిడి లక్ష్మి' కొత్త ఫోక్ సాంగ్.. కంప్లీట్ రీఫ్రెషింగ్‌ గా ఉందే!

తెలుగు సినిమాల్లో ఫోక్ సాంగ్స్ కు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. విలేజ్ లైఫ్ స్టైల్, అక్కడి మనుషులు, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను పాటలో చూపిస్తే ఆ ఫీల్ మరింత పెరుగుతుంది.

By:  M Prashanth   |   25 Sept 2026 10:08 PM IST
గరివిడి లక్ష్మి కొత్త ఫోక్ సాంగ్.. కంప్లీట్ రీఫ్రెషింగ్‌ గా ఉందే!
X

తెలుగు సినిమాల్లో ఫోక్ సాంగ్స్ కు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. విలేజ్ లైఫ్ స్టైల్, అక్కడి మనుషులు, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను పాటలో చూపిస్తే ఆ ఫీల్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి జానపద వాతావరణంతోనే వస్తోంది గరివిడి లక్ష్మి సినిమాలోని కొత్త పాట. కొండ కోన కోరసు పాడే అంటూ సాగే ఆ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. సాంగ్ మొదలైనప్పటి నుంచే వినేవారికి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంది.





బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి లైఫ్ స్టోరీ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఆనంది లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొండ కోన కోరసు పాడే సాంగ్ లో మెయిన్ గా నార్త్ ఆంధ్ర ఫోక్ మ్యూజిక్ వినిపిస్తుంది. చరణ్ అర్జున్ అందించిన బాణీకి పల్లెటూరి వాయిద్యాల శబ్దాలు, వేగమైన బీట్స్ తోడయ్యాయి. దీంతో పాటకు మొదటి నుంచే మంచి ఊపు వచ్చింది. సాధారణంగా ఫోక్ సాంగ్స్‌ లో కనిపించే ఓల్డ్ స్టైల్ కు భిన్నంగా, వినడానికి రిఫ్రెషింగ్‌ గా అనిపించేలా పాటను రూపొందించారు.

సాంగ్ లోని పల్లవి కూడా వెంటనే గుర్తుండిపోయేలా ఉంది. కొండ కోన కోరసు పాడే అనే పదాలు పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కొండలు, కోనలు, విలేజ్ ఎన్విరాన్మెంట్, అక్కడి లైఫ్ స్టైల్ ను గుర్తు చేసేలా సాహిత్యం సాగుతుంది. ఫోక్ సాంగ్ కు ఉండాల్సిన మట్టి వాసనను ఉంచుతూనే, నేటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సాంగ్ ను కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది.

అనన్యా భట్ వాయిస్ సాంగ్ కు మరింత స్ట్రెంత్ ఇచ్చింది. ఆమె గొంతులోని ఎనర్జీకి పాటలోని బీట్స్ బాగా కలిశాయి. దీంతో సాంగ్ వినడానికి మాత్రమే కాకుండా స్క్రీన్ పై చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ కలిగించేలా మారింది. లిరికల్ వీడియోలో కనిపించిన విజువల్స్‌ లో పచ్చని పల్లెటూరి వాతావరణం, కలర్ ఫుల్ హంగులు కనిపిస్తున్నాయి. ఆనంది కూడా ఫోక్ లుక్‌ లో ఎనర్జిటిక్‌ గా కనిపిస్తున్నారు.

గరివిడి లక్ష్మి మూవీ నుంచి ఇప్పటికే నల జిలకర మొగ్గ, కోయగూర వంటి ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన కొండ కోన కోరసు పాడే కూడా అదే ఫోక్ వేలో సాగుతూ కాస్త ఎక్కువ ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. ఫోక్ మ్యూజిక్‌ ను ఇష్టపడేవారికి ఆ సాంగ్ కొత్తగా అనిపించే అవకాశముంది. ఫోక్ పాటల్లో ఉండే నేచురల్ ఊపు, విలేజ్ ఎన్విరాన్మెంట్, క్యాచీ పల్లవి కలిసి ఆ పాటను కంప్లీట్ రీఫ్రెషింగ్‌ గా మార్చాయి. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అంతా వేచి చూడాలి.