ఈ ఏడాది వినాయక చవితి స్పెషల్ రిలీజులివే!
వినాయక చవితి సీజన్ కు షెడ్యూల్ అయిన ఉన్న రవితేజ మాస్ జాతర సినిమా షూటింగ్ ఆలస్యం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది.
By: Sravani Lakshmi Srungarapu | 26 Aug 2025 10:00 PM ISTవినాయక చవితి సీజన్ కు షెడ్యూల్ అయిన ఉన్న రవితేజ మాస్ జాతర సినిమా షూటింగ్ ఆలస్యం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే మాస్ జాతర రిలీజ్ కాకపోయినా ఈ వారం పలు సినిమాలు థియేటర్లలో మరియు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
సుందరాకాండ
నారా రోహిత్ హీరోగా, శ్రీదేవి విజయ్, వ్రితి హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ కు నచ్చుతుందని మూవీపై ఎంతో నమ్మకంగా ఉంది చిత్ర యూనిట్.
త్రిబాణధారి బార్బరిక్
సత్యరాజ్, వశిష్ట సింహ, ఉదయభాను ప్రధాన పాత్రల్లో మైథలాజికల్ టచ్ తో రూపొందిన త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్ట్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా, శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కన్యాకుమారి
శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని ప్రధాన పాత్రల్లో నటించిన కన్యాకుమారి ఆగస్ట్ 27న రిలీజ్ కానుంది. రొమాంటిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
పరమ్ సుందరి
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ పరమ్ సుందరి. రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన పరమ్ సుందరి ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మంచి మ్యూజిక్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.
ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అవేంటంటే..
నెట్‌ఫ్లిక్స్‌లో..
కింగ్‌డమ్ అనే తెలుగు మూవీ ఆగస్ట్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మెట్రో ఇన్ డినో అనే బాలీవుడ్ మూవీ ఆగస్ట్ 29 నుంచి అందుబాటులోకి రానుంది.
ప్రైమ్ వీడియోలో..
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనే బాలీవుడ్ మూవీ ఆగస్ట్ 29 నుంచి అందుబాటులోకి రానుంది.
జియో హాట్‌స్టార్‌లో..
థండర్‌బోల్ట్స్ అనే ఇంగ్లీష్ మూవీ ఆగస్ట్ 27న రిలీజ్ కానుంది.
డే ఆఫ్ రెకనింగ్ అనే మాలీవుడ్ మూవీ ఆగస్ట్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
రాంబో ఇన్ లవ్ అనే తెలుగు సినిమా ఆగస్ట్ 29 నుంచి అందుబాటులోకి రానుంది.
