Begin typing your search above and press return to search.

మాస్ హీరోకి మూకీ డ్రామా సెట్ అవుతుందా?

ఈ నేపథ్యంలోనే అలాంటి ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో మన ముందుకు వస్తున్నారు విజయ్ సేతుపతి

By:  Madhu Reddy   |   29 Jan 2026 8:00 PM IST
మాస్ హీరోకి మూకీ డ్రామా సెట్ అవుతుందా?
X

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కటౌట్ తోనే మాస్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి. ఒకవైపు హీరోగా.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారు అంటేనే చాలు ఆయన డైలాగ్స్ కోసం.. ఆ డైలాగులో వచ్చే గ్రేస్ కోసం ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది. అలాంటి ఆయన తొలిసారి ఎటువంటి మాటలు లేకుండా మూకీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అని ప్రకటించడంతో అభిమానులే కాదు నెటిజన్స్ కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఒక మాస్ హీరో తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అంటే.. ఇక ఆ హీరో చెప్పే డైలాగులు థియేటర్లలో పేలిపోవాల్సిందే.. ఆడియన్స్ పేపర్లు చించి ఎగరేయాల్సిందే.. డైలాగ్స్ చెప్పేటప్పుడు వచ్చే సౌండ్ కి స్క్రీన్ చిరిగిపోవాల్సిందే. ఆ రేంజ్ లో మాస్ హీరో నుంచి డైలాగ్స్ అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక హీరోకి డైలాగ్స్ తక్కువగా ఉన్నాయి అంటేనే తట్టుకోవడం అసాధ్యం అలాంటిది ఈ సినిమాలో హీరోకే కాదు అసలు సినిమా మొత్తం డైలాగ్ లేకుండా వస్తోంది అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ ఆ సినిమా తెరపై విడుదలైనా.. దానిని ఆసక్తికరంగా చూస్తారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో మన ముందుకు వస్తున్నారు విజయ్ సేతుపతి

'గాంధీ టాక్స్' అనే పేరుతో నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇన్నాళ్లకు థియేటర్లలోకి విడుదలకు సిద్ధమయ్యింది. జనవరి 30న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు . అయితే ఈ ట్రైలర్ చూసి చాలామంది మొదట అర్థం కాలేదని చెప్పినా.. ఆ తర్వాత స్టోరీ ని అర్థం చేసుకొని అందులోని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు

సాధారణంగా ఒక హీరో ప్రేక్షకులను మెప్పించాలి అంటే తన నటనతోనే కాదు అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించగలగాలి.. అలాంటిది డైలాగ్స్ లేని సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. అలాంటప్పుడు ఆ సినిమాలో డైలాగ్స్ లేకపోయినా.. కథలోని డెప్త్ తో, ఎమోషన్ తో .. ఆడియన్స్ ను కట్టిపడేయాల్సి ఉంటుంది. మరి మాస్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతికి ఈ మూకీ డ్రామా సెట్ అవుతుందా అనే విషయం తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఈ సినిమాలో అతిథి రావు హైదరి హీరోయిన్గా నటిస్తోంది. అరవిందస్వామి కీలకపాత్ర పోషిస్తుండగా.. కిషోర్ పి భలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి స్టోరీకి మాటలు అవసరం లేదు. కొన్ని చూడడంతోనే మనసును హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలు ఉండవు అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుందని ట్రైలర్లో చెప్పుకొచ్చారు. ఇక డబ్బు అనేది నలుగురు వ్యక్తుల జీవితాలలో ఎలాంటి పరిణామాలకు కారణమయ్యింది అనే విషయాన్ని ఎటువంటి డైలాగ్స్ లేకుండా కథతోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మరి ఈ సినిమా రేపు థియేటర్లలో ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.