Begin typing your search above and press return to search.

సైలెంట్ గా ఓటీటీలోకి ‘గాయపడ్డ సింహం’.. ఎక్కడ చూడొచ్చంటే?

డిఫరెంట్ సినిమాలతో అలరించే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’ ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

By:  Madhu Reddy   |   22 May 2026 4:02 PM IST
సైలెంట్ గా ఓటీటీలోకి ‘గాయపడ్డ సింహం’.. ఎక్కడ చూడొచ్చంటే?
X

డిఫరెంట్ సినిమాలతో అలరించే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’ ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ డిఫరెంట్ యాక్షన్ డ్రామా, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. వీకెండ్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూసే సినీ ప్రియులకు ఇది ఒక సూపర్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అసలు విశేషాలేంటో చూద్దాం..

సడన్‌గా ప్రైమ్‌లోకి వచ్చేసింది:

సాధారణంగా పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చే ముందు చాలా ప్రమోషన్స్ చేస్తారు. కానీ ‘గాయపడ్డ సింహం’ మాత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.

అసలు కథ?:

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ 'దరహాస్' అనే ఒక సాదాసీదా కుర్రాడి పాత్రలో కనిపిస్తారు. గాయత్రి (మానసా చౌదరి) అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ దరహాస్, ఆమె తండ్రి పెట్టిన కండిషన్ ప్రకారం అమెరికాలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు.ఇక కష్టపడి వీసా సంపాదించి అమెరికాలో ల్యాండ్ అవుతాడు. కానీ, అక్కడ అడుగుపెట్టిన కేవలం 34 గంటల్లోనే కథ మొత్తం రివర్స్ అయి, తిరిగి ఇండియాకు వచ్చేయాల్సి వస్తుంది.

ట్రంప్‌పై పగ.. మాఫియా డాన్ ఎంట్రీ:

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కఠినమైన వలస విధానాల వల్ల డిపోర్ట్ అయిన భారతీయ విద్యార్థుల్లో దరహాస్ కూడా ఒకడు. తన జీవితాన్ని, ప్రేమను దూరం చేసిన ట్రంప్‌పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని దరహాస్ డిసైడ్ అవుతాడు. ఇక ఈ క్రమంలోనే అతని లైఫ్‌లోకి 'బ్రూటల్ ధర్మ' (జేడీ చక్రవర్తి) అనే ఒక డేంజరస్ మాఫియా డాన్ ఎంటర్ అవుతాడు. ఇక అక్కడి నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.అనేది సినిమా కధ.

స్టార్ కాస్ట్ హైలైట్స్:

ఈ సినిమాలో శ్రీవిష్ణు 'భైరవ దాస్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించగా, ఫరియా అబ్దుల్లా 'శాలిని' అనే కీలక పాత్రలో కనిపించింది. ఇక చాల రోజుల తరువాత జేడీ చక్రవర్తి విలనిజం, తరుణ్ భాస్కర్ యాక్టింగ్ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.

మరో ఓటీటీ అప్‌డేట్:

‘గాయపడ్డ సింహం’తో పాటు ఓటీటీ లవర్స్ కోసం మరో క్రేజీ అప్‌డేట్ కూడా ఉంది. సూపర్ హిట్ సినిమా 'ధురంధర్-1' అన్‌కట్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాల నిడివితో అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన సీన్లు ఇందులో చూడొచ్చు.

థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలు చాలావరకు ఓటీటీలో అదరగొడుతుంటాయి. మరి అమెరికా నుంచి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు, మాఫియా డాన్‌తో కలిసి ఏం చేశాడు? ట్రంప్‌పై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేది తెలియాలంటే ప్రైమ్ వీడియోలో ‘గాయపడ్డ సింహం’ సినిమా చూసేయాల్సిందే..