Begin typing your search above and press return to search.

50,000 పాట‌లు 8 జాతీయ అవార్డులు.. అసాధార‌ణ‌ గాయకుడి క‌థ‌..

60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 50,000 పైగా పాటలు పాడిన దిగ్గజ గాయకుడు కె.జె. యేసుదాస్. ఆయ‌న మొత్తం 8 సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

By:  Sivaji Kontham   |   11 Jan 2026 7:00 PM IST
50,000 పాట‌లు 8 జాతీయ అవార్డులు.. అసాధార‌ణ‌ గాయకుడి క‌థ‌..
X

60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 50,000 పైగా పాటలు పాడిన దిగ్గజ గాయకుడు కె.జె. యేసుదాస్. ఆయ‌న మొత్తం 8 సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒక రికార్డు. ఆయ‌న తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మాత్ర‌మే అన్ని అవార్డులు(6సార్లు) అందుకోగ‌లిగారు.

తెలుగు, మలయాళం, హిందీ భాషలలో పాడిన పాటలకు గాను ఈ జాతీయ పురస్కారాలు లభించాయి. తెలుగులో: 'మేఘసందేశం' (1982) చిత్రంలోని 'ఆకాశ దేశాన ఆషాఢ మాసాన' పాటకు ఆయన జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అంతేకాదు ఆయ‌న త‌న‌కు వ‌చ్చిన పుర‌స్కారాల‌ను లెక్కించేందుకు కూడా స‌మ‌యం లేన‌త బిజీ అయ్యారు. ఓసారి త‌న‌కు వ‌చ్చిన ప‌థ‌కాల‌పై సరదాగా జోక్ కూడా చేసారు. త‌న‌కు వచ్చిన అవార్డుల గురించి చమత్కరిస్తూ ఆయ‌న ఇలా అన్నారు.

ఓ సంద‌ర్భంలో ఆయ‌న‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఇంట్లో అవార్డుల‌ను స‌ర్ధానికి చోటు స‌రిపోవ‌డం లేదు. వాటిని క్లీన్ చేయడం కూడా ఒక పెద్ద పని అయిపోయింది. ఇకపై వచ్చే అవార్డులను ట్రోఫీలుగా కాకుండా, ఏదైనా ఉపయోగపడే వస్తువులుగా ఇస్తే బాగుంటుంది.. అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

కేజే ఏసుదాసు అంటే విన‌యవిధేయ‌త‌లు.. ఆయ‌న ఒదిగి ఉండే స్వ‌భావం ఎంతో గొప్ప‌ది. వినయం ఎంతటిదంటే.. 1987లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తనకు వరుసగా రాష్ట్ర అవార్డులు ఇస్తుంటే ''నాకు బదులు యువ గాయకులకు అవకాశం ఇవ్వండి.. నన్ను అవార్డుల రేసు నుండి మినహాయించండి'' అని స్వయంగా కోరారు. ఆయ‌న వ‌య‌సు ఇప్పుడు 86. ప్రస్తుతం అమెరికాలో తన కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా ఆయ‌న దృష్టి ఇంకా సంగీతంపైనే ఉంది. సాధనను మాత్రం విస్మరించలేదు.

మొత్తం 14 కంటే ఎక్కువ భాషల్లో (అరబిక్, రష్యన్, లాటిన్ కూడా) ఆయ‌న 50వేలు పైగా పాట‌ల‌ను పాడారు. జేసు దాసుకు దేశ‌ అత్యున్న‌త పౌర పురస్కారాలు పద్మశ్రీ (1975), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్ (2017) ద‌క్కాయి.