Begin typing your search above and press return to search.

యూత్ పల్స్ పట్టుకునేలా గాబరా గాబరా సాంగ్

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల హవా గట్టిగానే నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

By:  M Prashanth   |   28 Jan 2026 11:13 AM IST
యూత్ పల్స్ పట్టుకునేలా గాబరా గాబరా సాంగ్
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల హవా గట్టిగానే నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు.పి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.





ఈ మూవీలోని సెకండ్ సింగిల్ గాబరా గాబరా సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటను స్టార్ సింగర్ సంతోష్ నారాయణన్ తనదైన స్టైల్లో పాడారు. సాంగ్ వింటుంటే చాలా ఫ్రెష్‌గా, నేటి జనరేషన్ లైఫ్‌స్టైల్‌కు అద్దం పట్టేలా అనిపిస్తోంది. లైఫ్ మొత్తం గందరగోళంగా ఉన్నప్పుడు ఒక కుర్రాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది ఈ సాంగ్‌లో క్లియర్ గా కనిపిస్తోంది.

ఇక రాకేందు మౌళి అందించిన సాహిత్యం చాలా వెరైటీగా ఉంది. మనం రోజువారీ లైఫ్ లో ఫేస్ చేసే చిన్న చిన్న ఇబ్బందులు, కన్ఫ్యూజన్స్ ని సరదాగా లిరిక్స్ లో పొందుపరిచారు. బంతి భోజనంలో బంతిని వడ్డిస్తారా అంటూ సాగే లైన్స్ భలే ఫన్నీగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ వాయిస్ లో ఉండే ఆ కిక్ పాటని పదే పదే వినేలా చేస్తోంది. మ్యూజిక్ కూడా రొటీన్ కి భిన్నంగా చాలా కొత్తగా అనిపిస్తుంది.

వీడియోలో హీరో సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంది. ఆఫీస్ టెన్షన్లు, సిటీలో ట్రాఫిక్ కష్టాలు, ప్రయాణాల్లో పడే అవస్థలు ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యేలా ఉన్నాయి. హీరోయిన్ మానస వారణాసి కూడా ఈ సాంగ్ లో చాలా సింపుల్ గా, పద్ధతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఉండే ఆ చిన్నపాటి ఎమోషన్ కూడా ఈ సాంగ్ లో బాగా ఎలివేట్ అయ్యింది.

హీరో సంతోష్ శోభన్ విషయానికి వస్తే, తన కెరీర్ లో ఒక సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ పడితే తన రేంజ్ మారుతుంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో ఆ వెలితి తీరుతుందని తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ గాబరా గాబరా సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టే కనిపిస్తోంది. ఒక ఆర్టిస్ట్ గా సంతోష్ శోభన్ తన బెస్ట్ ఇస్తూనే ఉన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందన్నట్టుగా, ఈ సినిమాతో కోరుకున్న విజయం దక్కుతుందని ధీమాగా ఉన్నది. ఫిబ్రవరి 14న థియేటర్లలో ఈ కపుల్ ఫ్రెండ్లీ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి.