Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సీక్వెల్ కు తిప్పలు.. అసహనంలో స్టార్ హీరో?

మొదటి భాగం గ్లోబల్ స్థాయిలో సత్తా చాటడంతో, రెండో భాగం అంతకు మించి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

By:  M Prashanth   |   10 Dec 2025 9:21 AM IST
పాన్ ఇండియా సీక్వెల్ కు తిప్పలు.. అసహనంలో స్టార్ హీరో?
X

ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ హవా నడుస్తోంది. మొదటి పార్ట్ హిట్ అయితే చాలు, రెండో పార్ట్ పై అంచనాలు హై రేంజ్ కు వెళుతున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక భారీ ఫ్యూచరిస్టిక్ మైథాలజీ సినిమా విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బయటకి అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం వ్యవహారం వేరేలా ఉందట.

మొదటి భాగం గ్లోబల్ స్థాయిలో సత్తా చాటడంతో, రెండో భాగం అంతకు మించి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం చూస్తుంటే, ఆ సీక్వెల్ పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియక, అప్‌డేట్స్ లేక ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు ఇంకా తికమక పడుతున్నారట. రాసుకున్న కథలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతుందని, స్టోరీ ఫ్లోలో ఆశించిన మ్యాజిక్ రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా కథలో ఉన్న లోపాలను సరిచేయలేక దర్శకుడు సతమతమవుతున్నారట. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్ కి రాకపోవడమే ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణం.

ఈ జాప్యం వల్ల సదరు పాన్ ఇండియా స్టార్ హీరో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించి వెయిట్ చేస్తున్న ఆ హీరో, పదే పదే షూటింగ్ వాయిదా పడుతుండటంతో బాగా డిజప్పాయింట్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్వరగా కథను లాక్ చేయకపోవడంతో, సమయం వృధా అవుతుందని ఆ హీరో భావిస్తున్నారట.

వాస్తవానికి ఈపాటికే ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావాలి. కానీ స్క్రిప్ట్ లో ఉన్న గందరగోళం వల్ల షెడ్యూల్స్ అన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ సినిమా రిలీజ్ డేట్ మీద కూడా గట్టిగానే పడే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి సినిమా రావడం కష్టమేనని, షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా ఆ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి దర్శకుడు ఈ చిక్కుముడులన్నీ విప్పి, హీరోని ఎప్పుడు కూల్ చేస్తారో, సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారో చూడాలి. అంతవరకు ఈ సస్పెన్స్ కంటిన్యూ అవ్వాల్సిందే.