మొత్తానికి ఆ నటుడి తలబిరుసు దిగిపోయిందా!
2007-2015 మధ్య ఓ యంగ్ హీరో పుల్ ఫాంలో ఉండేవాడు. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
By: Srikanth Kontham | 22 Jan 2026 11:00 PM IST2007-2015 మధ్య ఓ యంగ్ హీరో పుల్ ఫాంలో ఉండేవాడు. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అవ్వడంతో చాలా వేగంగా పాపులర్ అయ్యాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటికే ఇండస్ట్రీలో వారసులు కొనసాగుతున్నారు. వాళ్ల మధ్యలో..వాళ్లకే పోటీగా వచ్చి సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అతడి విషయంలో ప్రతిభ కంటే అదృష్టమే కలిసొచ్చింది. అలా ఏడెనిమిది సంవత్సరాల పాటు నటుడిగా బాగానే కొనసాగాడు.
కానీ ఈ ప్రయాణంలో అన్నే విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. అందుకు కారణం కూడా ఆ నటుడే. స్టార్ ఇమేజ్ ని తలకెక్కించుకుని క్రమ శిక్షణ లేకపోవడం వంటి అంశాలు అతడిని ఎంత వేగంగా పైకి లేపాయో అంతే వేగంగా పాతాళానికి తొక్కేసాయి. ఆ యంగ్ హీరో బిజీగా ఉన్న సమయంలో నిర్మాతల్ని నానా ఇబ్బందులు పెట్టేవాడు అన్నది అంతే వాస్తవం. సినిమా షూటింగ్ కి టైమ్ కి రాకపోవడం..ముఖ్యమైన సన్నివేశాలున్నాయని చెప్పినా అశ్రద్ద చేయడం...ఫోన్ చేస్తే లిప్ట్ చేయకపోవడం...దర్శకుల్ని వెయిట్ చేయించడం ఇలా ఒకటేంటి ఫాంలో ఉన్నంత కాలం దర్శక, నిర్మాతల సహనాన్నే పరీక్షించాడు.
కానీ రోజులన్నీ అతడివే కాదు గా. ఎంత వేగంగా సక్సెస్ అయ్యాడో? అంతే వేగంగా అదే ఫాంని కోల్పోయాడు. దీంతో సినిమా అవకాశాలు తగ్గాయి. చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడం మొదలైంది. వెరసీ ఇప్పుడు అదే ఇండస్ట్రీలో చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నా? ప్రోఫెషనల్ కెరీర్ లో మాత్రం బిజీగా లేడు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మునుపటిలా అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు ఏ దర్శక, నిర్మాత మాటనైతే పెడ చెవిన పెట్టాడో? ఆ నిర్మాతలెవరు కూడా ఆ హీరో తారస పడినా పట్టించుకోవడం లేదుట.
`హాయ్` అని హీరో పలకరించినా తెలియని వ్యక్తి పలకరింపులా చూసెళ్లిపోతున్నారుట నిర్మాతలు. ఒకప్పుడు చూపించిన యాటిట్యూడ్ ఇప్పుడెంత మాత్రం చూపించలేదుట. ఎంతో డౌన్ టూ ఎర్త్ గా ఉంటున్నాడుట. కనిపించిన వారితో పొలైట్ గా మాట్లాడటం. ఒకప్పటి స్టార్ ని అనే ఇమేజ్ ను పక్కన బెట్టి అందరితో కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని చేసినా? ఏం లాభం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నట్లే. అందుకే ఇండస్ట్రీలో ప్రతిభ కంటే ముందు ఉండాల్సింది క్రమశిక్షణ అంటారు.
