Begin typing your search above and press return to search.

అప్పటి బోయపాటిని గుర్తు చేస్తారా..!

డైరెక్టర్ గా రెండు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకున్నారు టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను.

By:  Ramesh Boddu   |   20 Jan 2026 1:00 PM IST
అప్పటి బోయపాటిని గుర్తు చేస్తారా..!
X

డైరెక్టర్ గా రెండు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకున్నారు టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను. బోయపాటి సినిమా అంటే చాలు ఆడియన్స్ కూడా ఊగిపోయేలా మాస్ కథలు, యాక్షన్ సీన్స్ ఉంటాయి. సీట్లో కూర్చున్న ఆడియన్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడమే తన లక్ష్యమని చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు బోయపాటి. తొలి సినిమా భద్ర నుంచి రీసెంట్ గా లాస్ట్ మంత్ రిలీజైన అఖండ 2 వరకు బోయపాటి తీసిన 11 సినిమాల్లో ఎక్కువగా మాస్ సినిమాలే ఉన్నాయి.

బోయపాటి అంటే తెర మీద రక్తపాతం జరగాల్సిందే..

ఐతే బోయపాటి అంటే ఇంతే తెర మీద రక్తపాతం జరగాల్సిందే. హీరో శత్రువులను చీల్చి చెండాడాల్సిందే అనుకుంటారు. కానీ బోయపాటి తన మొదటి రెండు సినిమాలు కేవలం యాక్షన్ మాత్రమే కాదు లవ్ స్టోరీ, ఎమోషన్ ని వర్క్ అవుట్ చేశాడు. బోయపాటి తొలి సినిమా భద్ర. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఓ పక్క లవ్ స్టోరీ తో పాటు మంచి యాక్షన్ అంశాలు ఉంటాయి.

భద్రతో డైరెక్టర్ గా బోయపాటి ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ తో తులసి సినిమా చేశాడు బోయపాటి శ్రీను. ఆ సినిమా కూడా యాక్షన్ సీన్స్ కన్నా ఎమోషనల్ సీన్స్ డామినేట్ చేస్తాయి. ఇలా తులసి, భద్ర సినిమాల టైం లో ఉన్న బోయపాటి మూడవ సినిమా సిం హా నుంచి అఖండ 2 వరకు పూర్తిగా మాస్ అంశాలకే పరిమితం అవుతున్నాడు.

మాస్ యాక్షన్ సినిమాలతో ఒక సెపరేట్ క్రేజ్..

బోయపాటి భద్ర, తులసి టైంలో చేసినట్టుగా మరోసారి లవ్ స్టోరీస్, ఎమోషనల్ బ్లాగ్స్ ని గుర్తు చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. భద్ర సినిమా రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీ అని ఇప్పటికీ చెప్పుకుంటారు. సో అలాంటి కథలు, సినిమాలు మళ్లీ బోయపాటి నుంచి రావాలని ఆడియన్స్ కోరుతున్నారు. ఐతే మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న బోయపాటి రెగ్యులర్ రివెంజ్ డ్రామాలని వదిలి లవ్ స్టోరీస్, ఎమోషనల్ కథలతో తన మార్క్ యాక్షన్ జోడించి తీస్తే బాగుంటుందని నెటిజన్ల మాట.

బోయపాటి సినిమా అంటే ఒక ఫార్మెట్ లో వెళ్తుంది అనుకున్న ఆడియన్స్ కి మళ్లీ తన నూతన ఉత్సాహంతో కొత్త కథలతో రంజింప చేయాలని ఆయన సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కోరుతున్నారు. కచ్చితంగా బోయపాటి శ్రీను కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిందే అని చెప్పొచ్చు. అఖండ 2 తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీ కాబట్టి బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరన్నది సస్పెన్స్ గానే ఉంది.