Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ మొద‌లైందా?

ఒక సినిమా హిట్ అయినా..బ్లాక్ బ‌స్ట‌ర్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్నా వెంట‌నే మిగ‌తా వారంతా దాన్ని ఓ ట్రెండ్‌లా భావించి ఫాలో కావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

By:  Ravindar Gorantla   |   6 April 2026 11:00 PM IST
బాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ మొద‌లైందా?
X

ఒక సినిమా హిట్ అయినా..బ్లాక్ బ‌స్ట‌ర్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్నా వెంట‌నే మిగ‌తా వారంతా దాన్ని ఓ ట్రెండ్‌లా భావించి ఫాలో కావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కంటెంట్ ద‌గ్గ‌రి నుంచి ర‌న్ టైమ్ వ‌ర‌కు ఫాలో అవుతూ అదే త‌ర‌హా సినిమాలు చేసి మ‌నం కూడా కోట్లు కొల్ల‌గొట్టాల‌నే సంస్కృతి గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీల్లో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ డ్రామా `బాహుబ‌లి` వ‌స్తే ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతూ బాలీవుడ్‌లో చాలా సినిమాలు పుట్టుకొచ్చాయి.

బాజీరావు మ‌స్తానీ, ప‌ద్మావ‌త్‌, మ‌ణిక‌ర్ణిక‌, త‌నాజీ, కేస‌రి, క‌లంక్‌ వంటి సినిమాలొచ్చాయి. కానీ అందులో బాజీరావు మ‌స్తానీ, ప‌ద్మావ‌త్‌, త‌నాజీ త‌ప్ప ఏవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయాయి. ఆ త‌రువాత కూడా అక్ష‌య్ కుమార్ హీరోగా `స‌మ్రాట్ పృథ్వీరాజ్ వంటి సినిమాలొచ్చాయి కానీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక భారీ డిజాస్ట‌ర్‌లుగా మిగిలాయి. ఇప్పుడు బాలీవుడ్ మ‌రో కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతోంద‌ని తెలుస్తోంది. గతంలో సినిమా ర‌న్ టైమ్ 2:25 గంట‌ల‌కు మించి ఉండ‌కూడ‌ద‌ని రైట‌ర్స్‌కి, డైరెక్ట‌ర్స్‌కి కండీష‌న్స్ పెట్టార‌ట ప్రొడ్యూస‌ర్స్‌.

కానీ ఇప్పుడు మాత్రం మినిమం మూడున్న‌ర గంట‌లు లేక‌పోతే వ‌ద్దు అని ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్స్‌కు చెబుతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని జేడీ చ‌క్ర‌వ‌ర్తి తాజాగా `గాయ‌ప‌డ్డ సింహం` ప్రెస్ మీట్ వెల్ల‌డించారు. ఇక్క‌డి బాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ న‌డుస్తోంద‌ని, ఓ బ‌డా ప్రొడ్యూస‌ర్ గ‌తంలో సినిమా ర‌న్ టైమ్ 2:25 గంట‌ల‌కు మించి ఉండ‌కూడ‌ద‌ని రైట‌ర్స్‌కి, డైరెక్ట‌ర్స్‌కి కండీష‌న్స్ పెట్టిన ఆయ‌న ఇప్పుడు మాత్రం ర‌న్ టైమ్ మినిమ‌మ్ మూడున్న‌ర గంట‌లు ఉండాల్సిదేన‌ని చెబుతున్నాడ‌ని అన్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం రీసెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌పంజ‌నాన్ని సృష్టిస్తున్న `ధురంధ‌ర్ 2`. దీని ర‌న్ టైమ్ 229 నిమిషాలు అంటే మూడు గంట‌ల న‌ల‌భై తొమ్మిది నిమిషాలు. గ‌తంలో రెండున్న‌ర గంట‌ల నిడివి సినిమా అంటేనే ప్రొడ్యూస‌ర్లు, ప్రేక్ష‌కులు బెంబేలెత్తిపోయిన సంద‌ర్భాలున్నాయి. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు కూడా ఈ రేంజ్ నిడిని ఉన్న సినిమా అంటే అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసేవారు. ర‌న్ టైమ్ త‌గ్గించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టేవారు. గ‌తంలో `అర్జున్‌రెడ్డి` ర‌న్ టైమ్ 3 గంట‌ల 7 నిమిషాలు.

ఇంత ర‌న్ టైమ్‌తో ఎవ‌రైనా చూస్తారా? ప్రేక్ష‌కులు బోర్ పీల‌వుతారు. ర‌న్ టైమ్ కుదించాల్సిందేన‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి. ఎగ్జిబిట‌ర్లు ఇంత ర‌న్ టైమ్ అంటే మ‌రో షోకు ఇబ్బందు ఏర్ప‌డ‌తాయ‌ని వాదించారు. అయినా స‌రే సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో సందీప్‌రెడ్డి వంగ ర‌న్ టైమ్ త‌గ్గించ‌కుండానే రిలీజ్ చేయ‌డం అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే. ఇప్పుడు అదే ట్రెండ్‌ని చాలా వ‌ర‌కు సినిమాలు ఫాలో అవుతూ వ‌స్తున్నాయి. దాన్ని `ధురంధ‌ర్‌`, `ధురంధ‌ర్ 2 మ‌రో స్టేజ్‌కి తీసుకెళ్లింది.

కంటెంట్ బాగుంటే ర‌న్ టైమ్‌ని ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోర‌ని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. రీసెంట్‌గా విడుద‌లైన `ధురంధ‌ర్ ది రివేంజ్ ` ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1622 కోట్లు రాబ‌ట్టి సంచల‌నం దిశ‌గా ప‌య‌నిస్తోంది. రానున్న రోజుల్లో `బాహుబ‌లి 2`తో పాటు దంగ‌ల్ లైఫ్ టైమ్ వ‌సూళ్ల‌ని కూడా క్రాస్ చేస్తుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.