Begin typing your search above and press return to search.

4 ఇండస్ట్రీలు – 4 దిగ్గజాలు – ఒకే స్క్రీన్!

నాలుగు ప్రధాన చిత్ర పరిశ్రమల ధ్రువతారలు ఒకే స్క్రీన్‌ను పంచుకోవడం అనేది అరుదైన‌ మల్టీస్టారర్ సినిమా మాత్రమే కాదు. చరిత్రలో నిలిచిపోయే ఓ చారిత్రాత్మక ఘట్టంగా మారనుంది.

By:  Srikanth Kontham   |   23 Sept 2026 1:00 AM IST
4 ఇండస్ట్రీలు – 4 దిగ్గజాలు – ఒకే స్క్రీన్!
X

భారతీయ చలనచిత్ర రంగంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న తరుణంలో వెండితెరపై ఊహించని ఒక మహోజ్జ్వల ఘట్టానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన నలుగురు మహానటులు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, ఉలగనాయగన్ కమల్ హాసన్ , మమ్ముట్టి ఒకే ఫ్రేమ్‌లో కనిపించేలా భారీ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్ర‌చారం షురూ అయింది. నాలుగు ప్రధాన చిత్ర పరిశ్రమల ధ్రువతారలు ఒకే స్క్రీన్‌ను పంచుకోవడం అనేది అరుదైన‌ మల్టీస్టారర్ సినిమా మాత్రమే కాదు. చరిత్రలో నిలిచిపోయే ఓ చారిత్రాత్మక ఘట్టంగా మారనుంది.

దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయ సినిమాను తమ నటన, మేనియా, స్వాగ్‌లతో ఏకఛత్రాధిపత్యంగా ఏలిన దిగ్గజాలు వీరంతా. బాలీవుడ్ షెహెన్షాగా అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మాస్ .. గ్రేస్ కింగ్‌గా చిరంజీవి, కోలీవుడ్ సినీ ప్రయోగశాలగా కమల్ హాసన్, మాలీవుడ్ నటనాలంబనగా మమ్ముట్టి సంపాదించుకున్న గుర్తింపు అపారమైనది. ఈ నలుగురు నటులు తమ కెరీర్‌లో సాధించిన పురస్కారాలు, బాక్సాఫీస్ రికార్డులు , వారికున్న అభిమాన గణం అసాధారణమైనవి. వీరి అనుభవం, నటనా పటిమ , స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిపి ఒకే చిత్రంలో చూడటం ప్రేక్షకులకు ఐ-ఫీస్ట్‌గా మారనుంది.

ఇలాంటి భారీ లెజెండరీ కాంబినేషన్ కుదిరినప్పుడు దానికి తగ్గ కథను సిద్ధం చేయడం ప్రతిష్టాత్మకమైన సవాలు. ఈ నాలుగు శక్తుల పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ ఒక్కరి ఇమేజ్‌కు, నటనకు తగిన న్యాయం చేసే విధంగా ఓ ప్రతిష్టాత్మక పొలిటికల్ థ్రిల్లర్ లేదా చారిత్రాత్మక యాక్షన్ డ్రామా కథాంశాన్ని సిద్ధం చేసే పనిలో కొందరు అగ్రశ్రేణి రచయితలు, దర్శకులు నిమగ్నమైనట్లు స‌మాచారం. నలుగురు స్టార్ల అభిమానులను సంతృప్తి పరుస్తూనే గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించే రీతిలో సన్నివేశాలను ప్లాన్ చేయడం ప్రాజెక్ట్‌కి అత్యంత కీలకమైన అంశం.

బిజినెస్ , మార్కెట్ పరంగా చూస్తే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయడం ఖాయం. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు ప్రతి భాషా మార్కెట్‌లోనూ తిరుగులేని ఆధిక్యం ఉన్న నలుగురు నాయకులు ఒకే ప్రాజెక్ట్‌లో భాగమైతే ప్రీ-రిలీజ్ బిజినెస్ నుండి థియేట్రికల్ వసూళ్ల వరకు సరికొత్త రికార్డులు నమోదవుతాయి. ఈ విజువల్ వండర్‌ను నిర్మించేందుకు భారతీయ సినిమాలోని అగ్రగామి నిర్మాణ సంస్థలు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ముందుకు రావడానికి ఆసక్తి చూపించ‌డం క్రేజ్‌ను తెలియజేస్తోంది.

తరతరాల సినిమా ప్రేమికులకు ఈ కాంబినేషన్ ఓ తీపి కల లాంటిది. అమితాబ్ బచ్చన్ గాంభీర్యం, చిరంజీవి ఎనర్జీ ఈజ్, కమల్ హాసన్ వర్సటైలిటీ, మమ్ముట్టి ఇంటెన్స్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. ఈ నాలుగు భిన్నమైన శైలులు ఒకే సన్నివేశంలో ఎదురెదురుగా నిలిచినప్పుడు థియేటర్లలో వచ్చే ఎమోషనల్ హై పూనకాలను మాటల్లో వర్ణించలేం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే భారతీయ చలనచిత్ర వాణిజ్య పరిధి మాత్రమే కాదు. సృజనాత్మక సరిహద్దులు కూడా సరికొత్త శిఖరాలకు చేరుకోవడం ఖాయం.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు, ప్రణాళికలు ప్రాథమిక దశలోనే ఉన్నా? ఈ వార్త ప్ర‌చారం ఇండస్ట్రీలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ మాన్యుమెంటల్ ఫిల్మ్ గనుక అనుకున్నట్లుగా ఆకారం దాల్చి పట్టాలెక్కితే భారతీయ సినిమా సాధించిన అత్యున్నత విజయాలలో ఒకటిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై భారతీయ చలనచిత్ర రంగానికి ఉన్న సత్తాను చాటిచెబుతూ రాబోయే తరాలకు ఓ చారిత్రాత్మక నిదర్శనంగా ఈ అపూర్వ కలయిక నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.