Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: పెళ్ల‌యాక ఇస్లామ్‌లోకి మారిన స్టార్ వైవ్స్

భారతీయ సినీ పరిశ్రమలో సెల‌బ్రిటీల మ‌తాంత‌ర వివాహాలు ఎల్ల‌పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. ర‌క‌ర‌కాల‌ మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకోవడం దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ.

By:  Sivaji Kontham   |   10 Feb 2026 10:00 PM IST
టాప్ స్టోరి: పెళ్ల‌యాక ఇస్లామ్‌లోకి మారిన స్టార్ వైవ్స్
X

భారతీయ సినీ పరిశ్రమలో సెల‌బ్రిటీల మ‌తాంత‌ర వివాహాలు ఎల్ల‌పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. ర‌క‌ర‌కాల‌ మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకోవడం దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ. అయితే మత మార్పిడి అనేది తరచుగా వివాదాలకు లేదా చర్చలకు దారితీస్తుంటుంది. అయితే సినీ సెల‌బ్రిటీల్లో ఇప్ప‌టివ‌ర‌కూ బలవంతపు మత మార్పిడిల గురించి అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మతం మారడంపై కేవ‌లం ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అలాంటి కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులు ఇవి..

మ‌తాంత‌ర వివాహం అన‌గానే, సైఫ్ అలీ ఖాన్ - అమృత సింగ్ జంట పెళ్లి గుర్తుకొస్తుంది. అమృత సింగ్ సిక్కు కుటుంబానికి చెందిన యువ‌తి. ముస్లిమ్ అయిన సైఫ్‌ను వివాహం చేసుకునే ముందు ఇస్లాం మతంలోకి మారారు. అయితే ఇస్లామ్ తీసుకోవాల‌ని సైఫ్ బలవంతం చేశారా? అంటే.. సైఫ్ అలీ ఖాన్ కానీ ఆయన కుటుంబం కానీ అమృత‌ను బలవంతం చేసినట్లు ఎక్కడా అధికారికంగా ఆరోపణలు లేవు. అయితే ఆ కాలంలో నవాబ్ కుటుంబ సంప్రదాయాల ప్రకారం వివాహం జరగడానికి మత మార్పిడి ఒక భాగంగా జరిగిందని అంటారు. ఇక సైఫ్‌ తన రెండో భార్య కరీనా కపూర్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. కరీనా తన మతాన్ని మార్చుకోలేదు.. వారు రిజిస్టర్డ్‌ మ్యారేజ్ చేసుకున్నారు.

ధర్మేంద్ర - హేమ మాలిని జంట మ‌ధ్య బంధం, మ‌త మార్పిడి ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత చర్చనీయాంశమైన అంశం. ధర్మేంద్ర అప్పటికే ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. హిందూ చట్టం ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు. అందువ‌ల్ల రెండో వివాహం చేసుకోవడం కోసం ధర్మేంద్ర -హేమ మాలిని ఇద్దరూ ఇస్లాం మతంలోకి మారారు. ధర్మేంద్ర తన పేరును దిలావర్ ఖాన్‌గా, హేమ మాలిని అయేషా బియాగా మార్చుకుని నిఖా చేసుకున్నారు. ఇది బలవంతం వల్ల జరిగింది కాదు.. కేవలం చట్టపరమైన చిక్కుల నుండి తప్పించుకోవడానికి వారు తీసుకున్న నిర్ణయం.

లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ అస్మా రెహ‌మాన్ తో తన రెండో వివాహం కోసం ఇలాంటి వివాదాల్లో నిలిచారు. అత‌డు త‌న పేరును మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ గా మార్చుకున్నారు. అయితే ఆయన మొదటి భార్య సైరా బాను ఇస్లాం మతస్థురాలే కావడంతో అక్కడ సమస్య రాలేదు.

సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుటుంబం మొత్తం హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారారు. ఇది వారి వ్యక్తిగత, ఆధ్యాత్మిక నిర్ణయమని, ఎవరి బలవంతం లేదని ప‌లు ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. రెహ్మాన్ అస‌లు పేరు దిలీప్ కుమార్. ఇళ‌యరాజా, కోటి, మ‌ణిశ‌ర్మ‌ వంటి ప్ర‌ముఖుల వ‌ద్ద రెహ‌మాన్ ప‌ని చేసారు. అయితే ఇటీవ‌ల త‌న మ‌తం కార‌ణంగా సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు త‌గ్గాయ‌ని రెహ‌మాన్ ఆరోపించ‌డం సంచ‌ల‌నం అయింది.

సునీల్ దత్‌ను పెళ్లి చేసుకునేటప్పుడు న‌ర్గీస్ హిందూ మతంలోకి మారారు. ష‌ర్మిలా ఠాగూర్ ఇంత‌కుముందు పటౌడీని పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్లాంలోకి మారారు. సైఫ్‌- అమృతా సింగ్ సైతం నాటి సామాజిక కుటుంబ జీవ‌నంలో అది త‌ప్ప‌నిస‌రి అవ్వ‌డంతో మ‌త‌మార్పిడి జ‌రిగింది. కానీ సైఫ్ కానీ అత‌డి కుటుంబం కానీ బ‌ల‌వంతం చేయ‌లేదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో `బలవంతపు మత మార్పిడి` అని నటీమణులు కోర్టుకెళ్లిన దాఖలాలు స్టార్ల విషయంలో చాలా తక్కువ. చాలా సందర్భాల్లో నిఖా జరగాలంటే ఇస్లాం మతం ప్రకారం వధూవరులిద్దరూ ముస్లింలై ఉండాలి. పెళ్లి కోసం మాత్ర‌మే మతం మారుతుంటారు.