గురూజీ దృష్టిలో ఫ్లోరా పడుతుందా..?
బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీ కేటగిరి కింద వచ్చింది ఫ్లోరా షైనీ అదే ఒకప్పుడు ఆశా షైనీగా అలరించింది ఈ అమ్మడు.
By: Ramesh Boddu | 16 Sept 2025 1:00 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీ కేటగిరి కింద వచ్చింది ఫ్లోరా షైనీ అదే ఒకప్పుడు ఆశా షైనీగా అలరించింది ఈ అమ్మడు. తెలుగులో నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు సినిమాల్లో నటించి అలరించిన ఈ అమ్మడు కొన్ని సినిమాలు చేసింది కానీ అంత పాపులర్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేసినా లాభం లేదు. మధ్యలో కొన్నాళ్లు అడల్ట్రీ సినిమాలు చేసి కెరీర్ సాగించింది. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలా బిగ్ బాస్ సీజన్ 9 లో సర్ ప్రైజ్ చేసింది.
ఒకప్పటి హీరోయిన్స్ మీద త్రివిక్రం శ్రీనివాస్ గురి..
బిగ్ బాస్ సీజన్ 9 లో ఫ్లోరా షైనీని చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. అప్పుడు ఎంతో అందంగా అనిపించిన ఈ అమ్మడు ఇలా అయిపోయింది ఏంటని అనుకుంటున్నారు. ఐతే ఒకప్పటి హీరోయిన్స్ మీద త్రివిక్రం శ్రీనివాస్ గురి ఎప్పుడు ఉంటుంది. వాళ్లను తన సినిమాలతో రీ ఎంట్రీ ఇప్పిస్తాడు. సరైన పాత్రల్లో వారిని తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేస్తాడు.
అలా గురూజీ దృష్టిలో ఫ్లోరా షైనీ కూడా పడుతుందా లేదా అని చర్చిస్తున్నారు. ఎందుకంటే అమ్మడు చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు రైటర్ గా పనిచేశాడు త్రివిక్రం. సో కచ్చితంగా ఆమె గురించి త్రివిక్రం కి తెలియకుండా ఉండదు. అందుకే ఏదైనా సినిమాలో ఫ్లోరా షైనీకి మంచి రోల్ ఇస్తే మాత్రం తప్పకుండా ఆమె అలరిస్తుందని అనిపిస్తుంది.
నాగార్జున ముందు పంచాయితీ..
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫ్లోరా షైనీ సంజా గర్లానిల మధ్య గొడవ తెలిసిందే. ఫ్లోరాని ఫ్రీ బర్డ్ అన్న కారణంగా వీకెండ్ లో నాగార్జున ముందు పంచాయితీ పెట్టించింది. హౌస్ లో ఉన్నన్నాళ్లు సంజనా వర్సెస్ ఫ్లోరా మధ్య ఈ డిస్టబెన్స్ కొనసాగేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫ్లోరా షైనీ ఇంకాస్త మెరుగు పడాల్సి ఉందని లేకపోతే రాబోయే వారాల్లో ఆమె ఎలిమేషన్ తప్పదని అంటున్నారు.
ఇక త్రివిక్రం సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఆ నెక్స్ట్ ఎన్ టీ ఆర్ తో ఒక మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు త్రివిక్రం. ఆ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. త్రివిక్రం శ్రీనివాస్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. వెంకీ మామతో ఇన్నేళ్ల తర్వాత సినిమా పడతం సూపర్ అనిపిస్తుండగా తారక్ సినిమా పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.
