Begin typing your search above and press return to search.

ఈ ముద్దుగుమ్మల హవాకు కారణమేంటి?

సినిమా రంగంలో గెలుపోటములు సహజం. సాధారణంగా ఒక హీరోయిన్ వరుసగా ఫ్లాపులు చవిచూస్తే ఐరన్ లెగ్ ముద్ర పడటం, అవకాశాలు తగ్గడం చూస్తుంటాం.

By:  Srikanth Kontham   |   13 April 2026 8:15 AM IST
ఈ ముద్దుగుమ్మల హవాకు కారణమేంటి?
X

సినిమా రంగంలో గెలుపోటములు సహజం. సాధారణంగా ఒక హీరోయిన్ వరుసగా ఫ్లాపులు చవిచూస్తే ఐరన్ లెగ్ ముద్ర పడటం, అవకాశాలు తగ్గడం చూస్తుంటాం. కానీ ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్ అందుకు భిన్నంగా ఉంది. ఫలితంతో సంబంధం లేకుండా స్క్రీన్ ప్రెజెన్స్, సోషల్ మీడియా పాపులారిటీ , నటనపై ఉన్న నమ్మకంతో కొందరు కథానాయికలు క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కయాదు లోహర్, ఫరియా అబ్దుల్లా, నభా నటేష్ వంటి వారు వరుస పరాజయాల్లో ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.

`జాతి రత్నాలు` సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫరియా అబ్దుల్లాకు ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. అయినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అటు నభా నటేష్ కూడా సర్జరీ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నా ఇప్పటికీ మెగా ప్రాజెక్టుల రేసులో ఉండటం విశేషం. భామ‌ల వైవిధ్యమైన లుక్స్, మేకర్స్‌తో మంచి ప‌రిచ‌యాలు వీరిని రేసులో నిలబెడుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే ఆమె కెరీర్ ప్రారంభమే ఒక పెద్ద పాఠంగా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆమె మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

కానీ ఆ ఫ్లాప్ ప్రభావం ఆమె కెరీర్‌పై పడలేదు. అఖిల్ అక్కినేని సరసన `లెనిన్` వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో హీరో యిన్‌గా అవకాశం దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమెలోని గ్లామర్ , స్క్రీన్ అప్పీల్ దర్శకులను కట్టిపడేస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అలాగే శ్రీనిధి శెట్టి ప్రస్థానం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. `కేజీఎఫ్` గ్లోబల్ హిట్ తర్వాత ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా? ఆమె బ్రాండ్ వాల్యూ మాత్రం పదిలంగానే ఉంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకోవ‌డం ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

ఒక ఫ్లాప్ తర్వాత కూడా ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడం ఆమె లక్ అని చెప్పక తప్పదు. ఈ హీరోయిన్ల విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం కూడా భిన్నంగా ఉంటోంది. సినిమా ఫ్లాప్ అయినా? సదరు హీరోయిన్ నటనకు మార్కులు పడితే వారిని తదుపరి చిత్రాలకు ఎంపిక చేసుకోవడానికి దర్శకులు వెనకాడటం లేదు. కథకు సరిపోయే ముఖం, కమర్షియల్ యాంగిల్‌లో ఉన్న క్రేజ్ , ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ వంటి అంశాలు సినిమా ఫలితం కంటే ఎక్కువగా పని చేస్తున్నాయి. దీనివల్ల ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఆ ర‌కంగా టాలీవుడ్‌లో సక్సెస్ ఒక్కటే కొలమానం కాదని ఈ తారలు నిరూపిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని, గ్లామర్‌ను కాపాడుకుంటూ సరైన సమయంలో సరైన ప్రాజెక్టును ఎంచుకోవడంలో వీరు సఫలమవుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ క్రేజీ సినిమాలతోనైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, అపజయాల మధ్య కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం వీరి ప్రతిభకు నిదర్శనం.