Begin typing your search above and press return to search.

టైర్ వన్ హీరోగా మారాలంటే ఈ 5 ఫార్ములాలను పాటించాల్సిందే...

ఒక హీరో తన నట పోటెన్షియాలిటీని ఎలివేట్ చేసుకోవాలంటే అతని నటనను బయటికి తీయగలిగే క్యారెక్టర్ దొరకాలి.

By:  Gopi Velupala   |   2 Oct 2026 4:00 PM IST
టైర్ వన్ హీరోగా మారాలంటే ఈ 5 ఫార్ములాలను పాటించాల్సిందే...
X

సినిమాల్లో హీరోగా మారాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దానిని నిజం చేసుకుంటారు. కల కనడం ఒకెత్తయితే దానిని సాకారం చేసుకోవడం మరొకెత్తనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ లో హీరోగా రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రి పగలు మర్చిపోయి తిని తినక అవకాశం కోసం ఎదురుచూసిన సందర్భాలు సైతం చాలానే ఉంటాయి. ఏదో ఒక చిన్న అవకాశం వస్తే చాలు దాన్ని వాడుకొని నటనతో మ్యాజిక్ చేసిన నటులకు మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది. ఇండస్ట్రీ లో నటులుగా మారవచ్చు కానీ హీరోలుగా నిలదొక్కుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఒక్క సినిమా సక్సెస్ అయితే పది సినిమాల ఆఫర్లు వస్తాయి. కానీ అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే పట్టించుకునే నాధుడు కూడా ఉండడు. అలాంటి ఇండస్ట్రీ లో నటులుగా రానించి హీరోలుగా మారి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది నటులు ఈరోజు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమ హవాని కొనసాగిస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోలు సైతం టైర్ వన్ హీరోల లిస్టులో చేరిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి టైర్ వన్ హీరోలుగా మారాలి అంటే ఏం చేయాలి? దానికోసం ఒక ఐదు ఫార్ములాలను పక్కాగా పాటించాల్సిందే అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు... ఇంతకీ ఆ సూత్రలేంటంటే

స్క్రిప్ట్ సెలెక్షన్ తెలిసుండాలి...

ఒక హీరో తన నట పోటెన్షియాలిటీని ఎలివేట్ చేసుకోవాలంటే అతని నటనను బయటికి తీయగలిగే క్యారెక్టర్ దొరకాలి. ఆయన అందులో తన పూర్తి ఎఫర్ట్ పెట్టి నటించడమే కాకుండా వైవిధ్యాన్ని సైతం ప్రదర్శించడానికి అవకాశం ఉండాలి. ఒక సినిమా సక్సెస్ ని సాధించాలంటే కూడా స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి పాన్ ఇండియాలో టైర్ వన్ హీరోగా మారాలి అంటే స్క్రిప్ట్ సెలక్షన్ బాగుండాలి. ఈ జనరేషన్ ప్రేక్షకులకు ఎలాంటి కథలు నచ్చుతున్నాయి. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి ఏ స్టోరీ తో వెళితే బాగుంటుంది. అనే విషయాల్లో పూర్తి క్లారిటి తెచ్చుకొని కష్టపడుతూ ముందుకు సాగితేనే హీరో తనను తాను ఎలివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఓపెనింగ్స్

సినిమాల్లో హీరోగా నటించడం అంటే అంత తేలికైన విషయమైతే కాదు. సినిమా మొత్తాన్ని తనే భుజాల మీద మోయాల్సి ఉంటుంది. హీరో ఫేస్ చూసి ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. కాబట్టి ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాలంటే హీరో ఆడియన్స్ లో ఎంత నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలను చేసినప్పుడే ఆ హీరో మీద అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. ఆడియన్స్ లో అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన ఏ హీరో అయిన కూడా భారీ ఓపెనింగ్స్ ను తీసుకురాగలుగుతాడు. అప్పుడే ఒక నటుడు స్టార్ హీరోగా మారడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండును బట్టి చూస్తే టైర్ వన్ హీరోల సినిమాలు మొదటి రోజే వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఎవరైనా సరే టైర్ వన్ హీరోల లిస్టులో చేరాలి అంటే వాళ్లు కూడా తమ సినిమా ఓపెనింగ్స్ వందల కోట్లలో తీసుకురాగలగాలి. అలా చేస్తేనే వాళ్ళు టైర్ వన్ హీరోలుగా మారడానికి అవకాశం ఉంటుంది... అలాంటి క్రేజ్ రావాలంటే వాళ్లు చేసే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలి. కంటెంట్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడే సినిమా బాగా వస్తుంది. దానివల్ల హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తాయి...

డైరెక్టర్స్ కాంబినేషన్

ప్రస్తుతం హీరోకి ఉన్న మార్కెట్ ను బట్టి తను ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే తన మార్కెట్ పదిలంగా ఉంటుందో వాళ్లతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆ దర్శకుడి మార్కెట్ కూడా సినిమాకి హెల్ప్ అవుతుందనే ధోరణిలో హీరోలు ఆలోచించుకోవాల్సిన అవసరమైతే ఉంది . ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న దర్శకులతో సినిమా చేసి సక్సెస్ ని సాధించినప్పుడు మాత్రమే ఆ హీరోల క్రేజ్ పెరుగుతుంది. మార్కెట్లో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. అంతే తప్ప ఫేమ్ లో లేని దర్శకులతో సినిమాలను చేసి సినిమా మీద హైప్ ను క్రియేట్ చేయడం అనేది చాలావరకు వర్కౌట్ అవ్వని విషయమనే చెప్పాలి. అందుకే స్టార్ హీరోలందరు ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో ఆయా దర్శకులతో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక దర్శకుడిని నమ్మి సినిమా ఇవ్వడానికి వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు.

అందరిని థియేటర్ కి రప్పించాలి

కొన్నిరకాల పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయాలి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉండాలి. క్లాస్ ప్రేక్షకులను నవ్విస్తూనే, మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించాలి. లేడీ ఫ్యాన్స్ ను సంపాదించుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమాలు తీయాలి. అలా చేస్తేనే హీరోను అందరు ఇష్టపడుతారు...

బ్రాండ్ వాల్యూ

సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరో తన బ్రాండ్ వాల్యూ ను కలిగి ఉండాలి. తన ఫ్యాన్ బేస్ ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. సినిమాలతోనే కాకుండా పబ్లిక్ ఆక్టివిటీస్ ని చేస్తూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు ఆ హీరో మీద సాఫ్ట్ కార్నర్ ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఫ్యాన్స్ సైతం ఇష్టపడేలా చూసుకోవాలి...