Begin typing your search above and press return to search.

కేసు తో త‌గ్గాల‌నుకున్నా? కానీ ఆడ‌పులినై పోరాటం!

చేయ‌ని త‌ప్పుకు పోటీ నుంచి తానెందుకు త‌ప్పుకోవాల‌ని మ‌న‌సు చెప్పినా? దాన్ని అంగీక‌రించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టిందన్నారు.

By:  Srikanth Kontham   |   10 Sept 2025 7:00 PM IST
కేసు తో త‌గ్గాల‌నుకున్నా? కానీ ఆడ‌పులినై పోరాటం!
X

ఇటీవ‌లే జ‌రిగిన మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (`అమ్మ`) ఎన్నిక‌ల్లో గెలిచి అధ్య‌క్షురాలి శ్వేతా మీన‌న్ పీఠం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌ర్ది కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండ‌టంతో? ఎన్నిక‌పై ఆస‌క్తి నెల‌కొంది. చివ‌రి వ‌ర‌కూ ఎవ‌రు గెలుస్తారు? అన్న దానిపై త‌గ్గాఫ్ వార్ న‌డిచింది. అయితే ఎన్నిక కంటే ముందే మాలీవుడ్ లో కొంత హైడ్రా మా న‌డిచింది. శ్వేతామీన‌న్ నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనం త‌రం ఆమెపై ఓ కేస్ న‌మోదైంది. ఆమె బోల్డ్ చిత్రాల కార‌ణంగా యువ‌త చెడిపోతుంద‌ని కొచ్చిలో ఓ సామాజిక కార్య‌క‌ర్త కేసు వేసాడు.

గంద‌ర గోళానికి గురైన న‌టి:

అప్ప‌టి వ‌ర‌కూ లేని కేసు తొలిసారి నామినేష‌న్ దాఖ‌లు చేసిన స‌మ‌యంలో పైల్ అవ్వ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎన్నికల బ‌రి నుంచి శ్వేతామీనన్ త‌ప్పుకుంటుంద‌ని మీడియాలో క‌థ‌నాలు అంతే వేడెక్కించాయి. అయితే తానెక్క‌డా త‌గ్గ‌లేదు. ప్ర‌త్య‌ర్ధి బ‌లంగా ఉన్నా? కేసు ప‌డినా? ఎక్క‌డా బెద‌ర‌కుండా వార్ లోకి దిగి గెలిచారు. అయితే తాజాగా కేసు ప‌డిన నేప‌థ్యంలో తాను కూడా అయోమ‌యానికి గురైన‌ట్లు శ్వేతామీన‌న్ తెలిపారు. పోటీ చేయాలా? పోటీ నుంచి త‌ప్పుకోవాలా? అన్న దానిపై మ‌ద‌న ప‌డిన‌ట్లు గుర్తు చేసుకున్నారు.

కుటుంబ స‌భ్యుల ధైర్యంతోనే:

చేయ‌ని త‌ప్పుకు పోటీ నుంచి తానెందుకు త‌ప్పుకోవాల‌ని మ‌న‌సు చెప్పినా? దాన్ని అంగీక‌రించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టిందన్నారు. ఈ సమ‌యంలో కుటుంబ స‌భ్యులు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం త‌న‌కెంతో బాస‌ట‌గా నిలిచింద‌న్నారు. ఆ స‌మ‌యంలో త‌న‌ని దెబ్బ‌తిన్న ఆడ‌పులిగా పోల్చుకున్నారు. స‌మాజంలో చెడుగా చిత్రీక‌రించే ఇలా ఫిర్యాదులున్నా? వాటికి బ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గితే స‌మ‌స్య మ‌రో రూపంలో వ‌చ్చి న‌ప్పుడు ఏం చేస్తాన‌ని? తానే ధైర్యంగా ముందుకొచ్చిన‌ట్లు తెలిపారు. అలా శ్వేతామ‌న‌న్ చేసిన ధైర్యం తోనే `అమ్మ‌`కు తొలి మ‌హిళా అధ్య‌క్షురాలిని చేసింది.

శ్వేతామీన‌న్ తో సంకోచం లేకుండా:

ఇంత వ‌ర‌కూ `అమ్మ` అసోయేష‌న్ కు అధ్య‌క్షులుగా ప‌ని చేసిన వారంతా పురుషులే. మ‌హిళా న‌టుమ ణులు ఎవ‌రూ క‌నీసం పోటీ బ‌రిలో కూడా ఏనాడు నిల‌వ‌లేదు. కానీ శ్వేతా మీన‌న్ మాత్రం బ‌ల‌మైన ప్రత్య‌ర్ధిని ఢీకొట్టి అమ్మ పీఠంపై శిలా శాసనం రాసి ఓ చ‌రిత్ర‌లా నిలిచారు. అటుపై శ్వేతామీన‌న్ ని ఎన్నుకోవ‌డం కూడా గొప్ప విష‌యమ‌ని మాజీ అధ్యక్షుడు, న‌టుడు మోహ‌న్ లాల్ కూడా అభిప్రాయ ప‌డ్డారు. మ‌హిళ‌లు చ‌ర్చించ లేక‌పోయినా ఎన్నో విష‌యాలు ఇప్పుడు శ్వేతామీన‌న్ తో సంకోచం లేకుండా చ‌ర్చించేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.