మొదట్లో ఐరన్ లెగ్.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా చాలా ఇబ్బందులు పడతారు.
By: Madhu Reddy | 27 Oct 2025 11:08 AM ISTసినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. అయితే హీరోయిన్లు ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలి అంటే కమిట్మెంట్లు, క్యాస్టింగ్ కౌచ్ లు ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఇండస్ట్రీలో రాణిస్తేనే ముందుకు వెళ్తారు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే అందరికీ హిట్స్ పడిపోవు. ఎన్నో ఫ్లాప్ సినిమాలను, అవమానాలు ఎదుర్కొన్నాకే హిట్ సినిమాలు పడతాయి. అలా కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి రెండు మూడు సినిమాలు హిట్ కొడితే ఓకే.. లేకపోతే మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐరెన్ లెగ్ ముద్ర వేసుకొని ఆ తర్వాత సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
విద్యాబాలన్:
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అయితే ఈ హీరోయిన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. దానికి కారణం మోహన్ లాల్ తో ఆగిపోయిన చక్రం మూవీ..ఈ సినిమా డైరెక్టర్ కి - హీరో కి మధ్య గొడవలు రావడంతో ఆగిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్న విద్యాబాలన్ కి బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే మోహన్ లాల్ తో సినిమా అనగానే విద్యాబాలన్ కి దాదాపు 8,9 సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.కానీ ఎప్పుడైతే చక్రం మూవీ ఆగిపోయిందని తెలిసిందో ఆ తర్వాత రాత్రికి రాత్రే ఏకంగా 8,9 సినిమాల నుండి విద్యాబాలన్ ని తీసేసారట. దాంతో విద్యాబాలన్ పై ఐరన్ లెగ్ ట్యాగ్ వేశారు. కానీ ఆ తర్వాత డర్టీ పిక్చర్ అనే మూవీ తో విద్యాబాలన్ ఇండస్ట్రీని షేక్ చేసింది.
రమ్యకృష్ణ:
సౌత్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. ఈ ముద్దుగుమ్మ మొదట తమిళ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో భలే మిత్రులు మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే 1984లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణకి దాదాపు ఏడు సంవత్సరాలు గడ్డుకాలం నడిచిందట. ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ని తగిలించారు. కానీ విశ్వనాథ శాస్త్రి దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు సినిమా రమ్యకృష్ణ కెరియర్ ని మార్చేసింది. ఈ సినిమాతో ఆమెకు వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా సినిమాల్లోకి వచ్చాక దాదాపు 7 సంవత్సరాలు ఐరన్ లెగ్ అనే ముద్రతోనే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో రాణించింది. ఆ తర్వాత ఈమెకు తెలుగు, తమిళ భాషల్లో బ్రహ్మరథం పట్టారు.
నయనతార:
ఈ హీరోయిన్ మలయాళ సినిమాలతో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఆ సినిమాలు ఏవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ తెలుగు, తమిళ భాషలో విడుదలైన చంద్రముఖి సినిమా నయనతారకి మంచి క్రేజ్ తెచ్చింది.ఆ తర్వాత వచ్చిన గజిని కూడా నయన్ కెరీర్ ని మార్చేసింది.అలా తెలుగు, తమిళ భాషల్లో ఇప్పడికి స్టార్ హీరోయిన్ గా రాణించింది.
శృతిహాసన్ :
కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ శృతిహాసన్ కి వరుస డిజాస్టర్స్ తప్పలేదు. అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో లక్, అనగనగా ఓ ధీరుడు, 3, ఓ మై ఫ్రెండ్,7 ఓం అరివు వంటి వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీలో చేసిందో. ఆ తర్వాత ఈమె దశ తిరిగిపోయింది. ఈ మూవీతో ఐరన్ లెగ్ హీరోయిన్ కాస్తా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో శృతిహాసన్ ప్లాఫుల్లో ఉన్న హీరోలకు గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది.
