ఆకట్టుకోలేకపోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
ఒకప్పుడు టాలీవుడ్లో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. విజయశాంతి నుంచి అనుష్క వరకు ఈ జానర్లో సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌లు అందుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 24 Aug 2025 3:00 PM ISTఒకప్పుడు టాలీవుడ్లో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. విజయశాంతి నుంచి అనుష్క వరకు ఈ జానర్లో సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌లు అందుకున్నారు. అయితే రీసెంట్ గా రిలీజైన రెండు లేడీ ఓరియెంటెడ్ సినమాలైన 8 వసంతాలు, పరదా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవలేకపోయాయి. ఈ సినిమాలకు జరిగిన బిజినెస్ చూస్తుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇప్పటికే ఫేడవుట్ అయ్యాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 8 వసంతాలు సినిమా జూన్ 20న కుబేరతో పాటూ రిలీజైంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ సినిమాకు కలెక్షన్లు మాత్రం రాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. ఇక రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వచ్చిన పరదా సినిమాకు కూడా ఇదే పరిస్థితి. కంటెంట్ గురించి పక్కన పెడితే పరదా డే1 కలెక్షన్లు చూస్తే ఈ సినిమాపై ఆడియన్స్ కు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది.
అయితే ఆడియన్స్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పలేం. ఈ రోజుల్లో ఆడియన్స్ స్టార్ క్యాస్టింగ్ ను పట్టించుకోకపోయినా, వాళ్లను థియేటర్లకు వెళ్లేలా చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సినిమాలో ఎంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్నా, పెద్ద బడ్జెట్ సినిమా అయినా పాజిటివ్ టాక్ ను బట్టే థియేటర్లకు వెళ్లడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో ఫెయిలవుతోంది. బలగం, కోర్ట్ లాంటివి తప్ప ఆడియన్స్ నుంచి ప్రశంసలొచ్చిన సినిమాలు లేవు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అలాంటి కాన్సెప్ట్ తో వస్తే ఆడియన్స్ వాటిని కచ్ఛితంగా ఇష్టపడతారు. 8 వసంతాలు, పరదా సినిమాలు కూడా ఆడియన్స్ కు నచ్చినప్పటికీ వాటిని ఓటీటీలో చూడాలనే అనుకున్నారు కానీ థియేటర్లకు వచ్చి ఆ సినిమాలను చూసే స్పెషల్ ఎలిమెంట్స్ మాత్రం వాటిలో లేవు. త్వరలోనే రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్, అనుష్క ఘాటి సినిమాలు ఇద జానర్ లో రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఉన్న అపవాదులను తొలగించి తెలుగు సినిమాకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయేమో చూడాలి.
