Begin typing your search above and press return to search.

ఈ వారం చిన్న చిత్రాలదే.. సర్ప్రైజ్ హిట్ ఏది?

ఈ వారం ఏకంగా ఎనిమిది సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ అవన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం.

By:  M Prashanth   |   5 Feb 2026 5:25 PM IST
ఈ వారం చిన్న చిత్రాలదే.. సర్ప్రైజ్ హిట్ ఏది?
X

ఈ వారం ఏకంగా ఎనిమిది సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ అవన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. అలా అని వాటిని తీసిపారేయలేం. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ఇప్పటికే వివిధ చిన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఎనిమిది సినిమాల్లో ఏ ఒక్కదానిపై కూడా పెద్దగా హోప్స్ లేవ్. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో సోషల్ మీడియాలో బజ్ కనిపించడం లేదు. కానీ సర్ప్రైజ్ హిట్ అయితే మాత్రం చెప్పలేం. ముఖ్యంగా సంక్రాంతి సందడి ముగియడంతో థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఏ ఏ సినిమాలు బాక్సాఫీస్ కు ఊపునిస్తాయో అన్నది సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏ ఏ మూవీలు రిలీజ్ అవుతున్నాయంటే?

బరాబర్ ప్రేమిస్తా

సుమతీ శతకం

యుఫోరియా

హనీ

శ్రీ చిదంబరం గారు

ఎర్ర చీర

విత్ లవ్

ఆపరేషన్ పద్మ

అయితే వీటిలో బరాబర్ ప్రేమిస్తా మూవీ చుట్టూ అనేక చర్చలు జరుగుతున్నాయి. సినిమాలో లీడ్ రోల్ పోషించిన బుల్లితెర స్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. ప్రమోషనల్ ఈవెంట్ లో బూతు పదాలతో పాట పాడాడంతో అందరికీ సినిమా గురించి తెలిసింది. అదే సమయంలో మరో స్మాల్ స్క్రీన్ స్టార్ యాక్టర్ అమర్దీప్ చౌదరి.. సుమతీ శతకం ప్రమోషన్స్ జోరుగా జరగడంతో కాస్త సినీ ప్రియుల ఫోకస్ పడింది.

ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన గుణశేఖర్ దర్శకత్వం వహించిన యుఫోరియా సౌండ్ మోస్తరుగా వినిపిస్తోంది. వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు గుణశేఖర్. తెలుగు అందం దివి వడ్త్య నటించిన హనీ మూవీ ప్రమోషనల్ కంటెంట్ మోస్తరు రెస్పాన్స్ అందుకుని.. సినిమాపై కాస్ ఫోకస్ పడేలా చేసింది. మూవీలో దివి తన అందాలు ఆరబోసినట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.

అయితే తమిళ డబ్బింగ్ మూవీ విత్ లవ్, శ్రీ చిదంబరం గారు, ఎర్ర చీర, ఆపరేషన్ పద్మ వంటి సినిమాలు కూడా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వాటిపై సౌండ్ పెద్దగా లేకపోయినా.. కంటెంట్ పై నమ్మకంతో వస్తున్నాయి. అలా ఈ శుక్రవారం చిన్న సినిమాల సందడి కనిపించనుంది. మరి వాటిలో ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందోనన్నది ఆసక్తికరం. అదే సమయంలో సర్ప్రైజ్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ కు ఏ మూవీ ఊపునిస్తుందో వేచి చూడాలి.