అభిమానుల ఆవేదన తప్ప ఆవిడ సంతోషంగానే!
టాలీవుడ్ లో ఆవిడో పెద్ద స్టార్ హీరోయిన్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. లేడీ ఓరి యేటెడ్ సినిమాలు చేసింది.
By: Srikanth Kontham | 3 Sept 2025 11:00 PM ISTటాలీవుడ్ లో ఆవిడో పెద్ద స్టార్ హీరోయిన్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. లేడీ ఓరి యేటెడ్ సినిమాలు చేసింది. అశేషమైన అభిమానుల్ని కలిగి ఉంది. ఆమెంకటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. గుడులు గోపురాలు కట్టేంత అభిమానం ఆ నటిపై తెలుగు అభిమానులు చూపి స్తుంటారు. అటు తమిళనాడులోనూ అలాంటి అభిమానమే కనిపిస్తుంది. అయితే ఈ బ్యూటీ వెండి తెరపై కనిపించి రెండు సంవత్సరాలవుతుంది. దీంతో ఆమె కంబ్యాక్ విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
అవకాశాలు రాలేదని..సినిమాలు చేయలేదని అభిమానుల్లో ఒకటే ఆవేదన..అసంతృప్తి కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఆమె అభిమానులైతే పని గట్టుకుని అవకాశాలు ఎందుకు రావడం లేదో పదే పదే లేవ నెత్తు తున్నారు. సినిమా ఎప్పుడు అంటూ నిత్యం సోషల్ మీడియా వేదికగా, ఆమె ప్రయివేట్ ఖాతా ల్లో అడుగుతున్నారు. ఇప్పటి వరకూ లక్షల సందేశాలు వెళ్లి ఉంటాయి. కానీ వీటి గురించి సదరు నటి కనీసం స్పందించను కూడా లేదు. ఇలా అభిమానులు ఆవేదన..అసంతృప్తికి సోషల్ మీడియాలో గురి కావడం తప్ప ఆ నటికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు.
మీ పని మీదే..మా పని మాదే అన్న తీరుతో వ్యవహరిస్తోంది. వ్యక్తిగత జీవితంలో తాను చాలా సంతోషంగా కనిపిస్తోంది. ఇటీవలే ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని ప్రచారం కూడా జరిగింది. మొన్నటి వరకూ అది అంతా ప్రచారమనే అనుకున్నారు. కానీ అది ప్రచారం కాదని నిజమని బాలీవుడ్ మీడియాలో బలమైన కథనాలతో ప్రూవ్ అవుతుంది. ఫోటోలతో సహా వ్యవహారం బయటకు రావడంతో వ్యక్తిగత జీవితంలో తానెంత సంతోషంగా ఉందో అర్దమవుతోంది.
సినిమాలతో బిజీ అవ్వాలి..మళ్లీ పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఆశిస్తుంటే? తాను మాత్రం తనకు కావాల్సిన అన్ని రకాల వసతులు...సౌకర్యాలు కల్పించుకుని ఎంచక్కా అదమైన సెలబ్రిటీ లైఫ్ ని అస్వాదిస్తోంది. ఇటీవలే ఆ బ్యూటీ కొత్త ప్రియుడితో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్లినట్లు వార్త లొస్తు న్నాయి. మరి తిరిగొచ్చిన తర్వాత అభిమానుల కోరిక మేరకు సినిమాల గురించి ఆలోచన చేస్తుం దేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ప్రియుడితో విదేశాల్లో చిల్ అవుతోంది. మరి ఆ చిల్ మూవ్ మెంట్ నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటుందో.
