Begin typing your search above and press return to search.

రాఘవపూడి.. తెలివిగా దాచి ఉంచారా?

ప్రభాస్ లీడ్ రోల్ లో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   26 Oct 2026 1:00 AM IST
రాఘవపూడి.. తెలివిగా దాచి ఉంచారా?
X

ప్రభాస్ లీడ్ రోల్ లో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డార్లింగ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆ గ్లింప్స్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోల్ చూపించిన తీరు ఆకర్షించింది. కానీ కొన్ని సీన్స్ ఆడియన్స్ లో డౌట్స్ పెంచుతున్నాయి. అవి నిజంగానే కథలోని మిస్టేక్సా.. లేక హను రాఘవపూడి తెలివిగా దాచారా అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.

అయితే 'సీతారామం' సినిమాతో లవ్ స్టోరీని కొత్తగా చూపించిన దర్శకుడు హను రాఘవపూడి. ఆయన సినిమాల్లో కథతో పాటు ఎమోషన్స్ కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే 'ఫౌజీ' విషయంలోనూ ప్రేక్షకులు స్పెషల్ స్టోరీని ఆశిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్‌ లో మాత్రం కొన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ రోల్ కు సంబంధించిన సీన్స్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నాయి.

నేతాజీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తి ఒక సైనికుడి గురించి హిట్లర్‌ కు వివరాలు చెప్పడం వెనుక ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా అనేది కొందరి డౌట్. దేశం కోసం సీక్రెట్ గా పనిచేసే వ్యక్తి వివరాలను అంత ఈజీగా బయటపెట్టడం వెనుక ఉన్న ఒపీనియన్ ఏమిటనే చర్చ నడుస్తోంది. అయితే గ్లింప్స్‌ లో కనిపించిన సీన్స్ ఆధారంగా మాత్రమే ఒక డెసిషన్ కు రావడం తొందరపాటే అవుతుంది.

ఎందుకంటే, దర్శకుడు అసలు విషయాన్ని ఇప్పుడే చూపించకుండా దాచిపెట్టి ఉండవచ్చు. నేతాజీ చెప్పిన వివరాల వెనుక మరో అర్థం ఉండొచ్చు. శత్రువులను తప్పుదోవ పట్టించడానికి వేసిన స్ట్రాటజీలో భాగంగా ఆ సీన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ప్రభాస్ రోల్ కు సంబంధించిన అసలు సీక్రెట్ సినిమాలో మెయిన్ ట్విస్ట్ గా మారవచ్చు. అదే నిజమైతే, ఇప్పుడు ప్రేక్షకులకు కనిపిస్తున్న డౌట్లే సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్ట్ పెంచవచ్చు.

అయితే, ఇదంతా ఒక ఊహా మాత్రమే. సినిమాలో అలాంటి ట్విస్ట్ ఉందని మూవీ టీమ్ చెప్పలేదు. మరోవైపు, ప్రభాస్ పాత్రను గొప్పగా చూపించాలనే ఉద్దేశంతోనే కొన్ని సీన్స్ గ్లింప్స్‌ లో కట్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలా జరిగితే స్టోరీలోని అసలు స్త్రెంత్ చూపించడానికి బదులుగా హీరో ఎలివేషన్‌ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లవుతుంది. అందుకే పూర్తి సినిమా చూసిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక సినిమా టైటిల్ కూడా హైప్ పెంచుతోంది. గ్లింప్స్‌ తోపాటు టైటిల్ లో 'ఫైల్ నెం. 25' అని వేశారు మేకర్స్. దీంతో స్టోరీలో ఒక సీక్రెట్ ఫైల్‌ కు మెయిన్ ప్లేస్ ఉండవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. అయితే, ఆ ఫైల్‌ లో ఏముంది, దానికి ప్రభాస్ రోల్ కు ఉన్న సంబంధం ఏమిటనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలా హను రాఘవపూడి అన్ని డౌట్స్ కు స్టోరీలోనే ఆన్సర్స్ దాచి ఉంచారా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.