Begin typing your search above and press return to search.

ప్రభాస్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్టార్‌ హీరోలు దాదాపు అందరూ పాన్‌ ఇండియా సినిమాలంటూ భారీ ప్రాజెక్ట్‌లను నెత్తిన ఎత్తుకున్నారు.

By:  Ramesh Palla   |   18 Jun 2026 2:48 PM IST
ప్రభాస్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌..!
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్టార్‌ హీరోలు దాదాపు అందరూ పాన్‌ ఇండియా సినిమాలంటూ భారీ ప్రాజెక్ట్‌లను నెత్తిన ఎత్తుకున్నారు. మహేష్‌ బాబు ప్రస్తుతం టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఎంత వరకు సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇతర స్టార్‌ హీరోల సినిమాలు సైతం ఈ ఏడాదిలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాదిలో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాలేదు. 2026 ఫస్ట్‌ హాఫ్ పూర్తి కావస్తుంది. మరో రెండు వారాల్లో ఈ ఏడాది సెంకడ్‌ హాఫ్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు పెద్ద హిట్‌ జాడ లేదు, పెద్ద హీరోల సినిమాల హడావిడి లేకపోవడంతో సినీ ప్రేమికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పెద్ది బాక్సాఫీస్‌ సందడి..

ఇటీవల వచ్చిన పెద్ది సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసినప్పటికీ ఇంకా మరిన్ని పెద్ద హీరోల సినిమాలు రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫౌజీ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ తాజా పరిస్థితులను చూస్తూ ఉంటే దర్శకుడు హను రాఘవపూడి సినిమాను ఈ ఏడాదిలో పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. ఆ మధ్య డిసెంబర్‌ చివరి వరకు సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారంటూ ప్రభాస్ సన్నిహితులు లీక్‌ లు ఇచ్చారు. కానీ సినిమా ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. మరో ఫారిన్‌ షెడ్యూల్‌ బాకీ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఎంత స్పీడ్‌గా చేసినా సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయలేక పోవచ్చు అని చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌ మాట్లాడుకుంటున్నారు.

ప్రభాస్‌ ఫౌజీ సినిమా విడుదల...

ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమాతో తీవ్రంగా నిరాశ పరిచాడు. అందుకే ఆయన అభిమానులు ఫౌజీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు కారణం సెన్సిబుల్‌ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఫౌజీ గురించి పెద్దగా అప్‌డేట్స్ కూడా ఇవ్వక పోవడంతో ఈ ఏడాదిలో విడుదల చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అని, అందుకే అప్‌డేట్స్ ఇవ్వడం లేదని స్వయంగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 2027 ఆరంభంలోనే సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడితే సంక్రాంతికి కాకుండా సమ్మర్‌లో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్‌ సినిమా ఫౌజీ వచ్చే ఏడాదికి షిప్ట్‌ కావడం అభిమానులకు ఆవేదన కలిగించే విషయం.

ఎన్టీఆర్‌ డ్రాగన్‌ సినిమా...

ఇక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా డ్రాగన్‌. కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలని భావించారు. కానీ సెకండ్‌ హాఫ్ విషయంలో కాస్త సమయం ఎక్కువ అయ్యిందని, అందుకే షూటింగ్‌ కు చాలా పెద్ద గ్యాప్‌ వచ్చిందని అంటున్నారు. ఇటీవలే పునః ప్రారంభం అయినప్పటికీ అనుకున్న రేంజ్‌ స్పీడ్‌ తో సినిమా షూటింగ్‌ కావడం లేదని అంటున్నారు. ఇప్పటికే సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం జరిగింది.

కనీసం వచ్చే ఏడాది ప్రథమార్థంలో అయినా సినిమా విడుదల అయ్యేనా అనే అనుమానాలు ఇప్పుడు మొదలు అయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు.. షూటింగ్‌ ఇంకా చాలా వరకు పెండింగ్‌ ఉందట, ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ విషయంలో ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ అస్సలు తగ్గడం లేదట. అందుకే ఆలస్యం అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఆలస్యం అయినా అద్భుతాన్ని చూడబోతున్నారని డ్రాగన్‌ యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కి సైతం డ్రాగన్‌ ఆలస్యం బ్యాడ్‌ న్యూస్‌ అనక తప్పదు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో సినీ ప్రేమికులకు ఫుల్‌ మాస్ మసాలా వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.