ఫోటో స్టోరి: దేవతా సుందరికి మరో రూపం
ఇటీవలి కాలంలో ఫ్యాషనిస్టాలకు సైతం మతులు చెడగొడుతోంది ఫాతిమా సనా షేక్. ఈ బ్యూటీ నటించిన `గుస్తాక్ ఇష్క్` ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
By: Sivaji Kontham | 2 Dec 2025 10:31 PM ISTఇటీవలి కాలంలో ఫ్యాషనిస్టాలకు సైతం మతులు చెడగొడుతోంది ఫాతిమా సనా షేక్. ఈ బ్యూటీ నటించిన `గుస్తాక్ ఇష్క్` ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఫాతిమా సరసన విజయ్ వర్మ కథానాయకుడిగా నటించాడు. విజయ్- ఫాతిమ జంట కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటైంది! అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
మరోవైపు ఫాతిమ `గుస్తాక్ ఇష్క్` ప్రమోషన్స్ కోసం ఎంపిక చేసుకున్న చీరలు, డిజైనర్ దుస్తుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా కోఆర్డ్ సెట్ లకు బదులుగా ఫాతిమ చీరల్లో తళుకుబెళుకులు ప్రదర్శిస్తోంది. శాటిన్ శారీ, సీక్విన్ శారీ, వెల్వెట్ శారీ అంటూ రకరకాల డిజైనర్ లుక్స్ తో మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీటిస్తోంది ఫాతిమా.
తాజాగా వైట్ అండ్ వైట్ డిజైనర్ శారీలో ఫాతిమ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ లుక్ ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేసారు. ఫాతిమ సిగ్గులొలకబోస్తూ, అలా తెలుపు రంగు చీర - బ్లౌజ్ లో అందంగా దేవతాసుందరిని తలపిస్తోంది. ఈ ఫోటోషూట్ తో పాటు ఫాతిమా ఒక అందమైన క్యాప్షన్ ని కూడా ఇచ్చింది.
మనీష్ మల్హోత్రా హీరోయిన్ కావడం వల్ల కలిగే ప్రయోజనాలు.. బహుశా నేను ఇంతకు ముందు కంటే అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది... ధన్యవాదాలు మనీష్ అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేసింది. `దంగల్` చిత్రంలో రఫ్ గా `మగరాయుడు` తరహాలో కనిపించిన ఫాతిమ ఇప్పుడు చీరకట్టులో భర్తను ప్రేమించే ఒక అందమైన గృహిణిలా అందంగా కనిపిస్తోంది! అంటూ యూత్ కితాబిచ్చేస్తున్నారు.
