Begin typing your search above and press return to search.

వీడియో : షాకింగ్‌ జంప్ చేసిన హీరోయిన్‌

దంగల్‌ సినిమాలో రెజ్లర్‌ గీతా ఫోగాట్‌ పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్‌

By:  Ramesh Palla   |   6 Jan 2026 2:35 PM IST
వీడియో : షాకింగ్‌ జంప్ చేసిన హీరోయిన్‌
X

దంగల్‌ సినిమాలో రెజ్లర్‌ గీతా ఫోగాట్‌ పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్‌. ఆ సినిమాలో అమీర్ ఖాన్‌ కూతురు పాత్రలో నటించిన ఈ అమ్మడు, ఆ వెంటనే ఆయనకు జోడీగా, ఆయనతో కలిసి హీరోయిన్‌గా నటించి రొమాన్స్ చేసిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా ఫాతిమా సనా షేక్ కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంకు కారణం అమీర్‌ ఖాన్‌తో చేసిన సినిమా అంటూ చాలా మంది ఇప్పటికీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్‌గా ఫాతిమా ఎలాంటి పాత్రలు చేసేందుకు అయినా, ఎలా నటించేందుకు అయినా రెడీ అన్నట్లుగా ఉంటుంది. కానీ ఈ అమ్మడు ఎక్కువ శాతం రొమాంటిక్‌ పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఉన్న ఈ అమ్మడు ఎందుకు ఇలాంటి పాత్రలు చేయడం లేదు అంటూ చాలా మంది ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం.

దంగల్‌ హీరోయిన్‌ షాకింగ్‌ జంప్‌...

నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేయాలని తనకు ఉన్నప్పటికీ ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఇతర హీరోయిన్స్‌తో పోల్చితే ఈమె చాలా ధైర్యం ఉన్న హీరోయిన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూల్లో ఈమె మాట్లాడే మాటలు, ఇతర విషయాలు ఈమె ఏ స్థాయి ధైర్యంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉండే ఫాతిమా రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది. ఈమె షేర్‌ చేసే అందాల ఫోటోలు, వీడియోలు ఈమెను వార్తల్లో నిలుపుతాయి. తాజాగా మరోసారి ఈమె వీడియో గురించి అంతా మాట్లాడుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ఏకంగా పెద్ద గుట్ట మీద నుంచి వాటర్‌ లో దూకడం ద్వారా చాలా మంది హీరోయిన్స్‌ తో పోల్చితే ఈమె చాలా ధైర్యవంతురాలు అనే విషయం నిరూపితం అయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫాతిమా సనా షేక్‌ వీడియో వైరల్‌...

కొండ ప్రాంతంలో ఉన్న ఒక కొలనులో అత్యంత ఎత్తు నుంచి ఫాతిమా దూకుతున్న ఈ వీడియోను చూస్తే చాలా మంది షాక్‌ కాకుండా ఉండలేరు. సాధారణంగానే అలాంటి ప్రాంతాల్లో స్విమ్మింగ్‌ చేయడం చాలా ప్రమాదంగా ఉంటుంది. అలాంటిది అంత ఎత్తు నుంచి దూకడం అంటే మామూలు విషయం కాదు, అడుగున రాళ్లు ఉండవచ్చు, లేదంటే పై నుంచి దూకే సమయంలో ఏమైనా ప్రమాదం జరిగినా ఆశ్చర్యం లేదు. అలాంటి చోటు నుంచి సాధారణ జనాలే దూకడం కష్టం. అలాంటిది హీరోయిన్‌ అయిన ఫాతిమా సనా దూకడం మామూలు విషయం కాదు. ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను అని, కానీ జంప్‌ చేయాలని బలంగా నిర్ణయించుకున్న కారణంగా తాను ఇలా చేయగలిగాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియోను చూసి చాలా మంది ఫాతిమా ధైర్యంను కొనియాడుతూ చాలా మంది అమ్మాయిలకు ఈమె ఆదర్శం అన్నట్లుగా చెబుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాతిమా వీడియో..

ఈ వీడియోతో పాటు ఫాతిమా ఇన్‌స్టాగ్రామ్‌లో... ఆ గట్టు మీద నిలబడి దూకడానికి 20 నిమిషాలు పట్టింది. ధైర్యం తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. చాలా మదన పడ్డ తర్వాత జంప్‌ చేశారు. గాలిలో ఉన్నప్పుడు, నీటిని ఢీ కొనే ముందు క్షణం వరకు చాలా పొడువుగా అనిపిస్తుంది. ఆ సమయంలో నేను చాలా విచిత్రమైన అనుభూతికి గురి అయ్యాను. అదే సమయంలో నేను గందరగోళంలో ఉన్నాను. నేను ఎప్పుడైతే జంప్‌ చేశానో అప్పుడు అది నార్మల్‌ జంప్ అనిపించింది. జంప్‌ కి ముందు నాకు ఉన్న ఆలోచనలు అన్నీ కూడా జంప్‌ తర్వాత పోయాయి. నేను గొప్ప పని చేసిన సంతోషం ఉంది అన్నట్లుగా పోస్ట్‌ చేసింది. సాధారణంగా హీరోయిన్స్ స్విమ్మింగ్‌ పూల్‌ లోనే జంప్ చేసేందుకు భయపడుతారు. కానీ ఫాతిమా మాత్రం ఏకంగా అంత పెద్ద కొండ మీద నుంచి జంప్‌ చేయడం నిజంగా అభినందనీయం అంటూ ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.