Begin typing your search above and press return to search.

మాలీవుడ్ పై దంగ‌ల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మలయాళ సినిమాలు నేడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న తరుణంలో అక్కడి కథల్లో ఉండే సహజత్వం, పాత్రల చిత్రణ వెనుక దశాబ్దాల నాటి సాంస్కృతిక వారసత్వం ఉందని పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   17 Jun 2026 8:00 PM IST
మాలీవుడ్ పై దంగ‌ల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్. `దంగ‌ల్` సినిమాతో అమ్మ‌డికి ఎన‌లేని క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ విజ‌యం అమ్మ‌డి కెరీర్ నే మార్చేసింది. తాజాగా ఈ బ్యూటీ కేరళ పర్యటనకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. కేరళ రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని అక్కడి వాతావరణం తనపై చూపిన ప్రభావాన్ని ఓఇంటర్వ్యూలో వివరించారు. కేరళ భూభాగం కేవలం ప్రకృతి అందాలకే కాకుండా కళలకు కూడా పుట్టినిల్లు అని కొనియాడారు.

కేరళలో అడుగుపెట్టిన ప్రతిసారీ అక్కడ బలమైన కళాత్మక అభిరుచి -లోతైన సంస్కృతి స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి ప్రజల జీవనశైలిలోనే కళలు అంతర్భాగంగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు. కేవలం పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న చిన్న‌ గ్రామాల్లో సైతం సాహిత్య, సాంస్కృతిక విషయాల పట్ల ప్రజల్లో ఉండే అవ‌గాహన, గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ సాధిస్తున్న పురోగతి.. వారు ఎంచుకునే కథాంశాల వెనుక ఈ కళాత్మక నేపథ్యమే ప్రధానమని ఫాతిమా విశ్లేషించారు.

మలయాళ సినిమాలు నేడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న తరుణంలో అక్కడి కథల్లో ఉండే సహజత్వం, పాత్రల చిత్రణ వెనుక దశాబ్దాల నాటి సాంస్కృతిక వారసత్వం ఉందని పేర్కొన్నారు. ఒక నటిగా ఇలాంటి సృజనాత్మక వాతావరణం తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. బాలీవుడ్ లేదా ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కేరళను కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా సరికొత్త సరిహద్దులను అన్వేషించే సృజనాత్మక కేంద్రంగా చూస్తున్నారు. ఫాతిమా సనా షేక్ కూడా కేరళ సంప్రదాయాలు, అక్కడి కళారూపాలు తనను మానసికంగా ఎంతో ప్రశాంతతకు గురిచేశాయని తెలిపారు.

ఇక్కడి సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత కారణంగానే ఇక్కడి నుండి వచ్చే కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని కొనియాడారు. పాన్-ఇండియా సంస్కృతి పెరిగిన తర్వాత వివిధ పరిశ్రమల మధ్య సృజనాత్మక మార్పిడి మరింత విస్తృతమైంది. ఉత్తరాదికి చెందిన నటీనటులు దక్షిణాది సంస్కృతిని, ముఖ్యంగా కేరళ జీవనవిధానాన్ని ఇంతలా ఆరాధించడం ఇండస్ట్రీలో మారుతున్న సానుకూల ధోరణికి నిదర్శనం. ప్రాంతీయ సరిహద్దులు దాటి కళను, సంస్కృతిను గౌరవించే తత్వం చిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేస్తుందని ఫాతిమా మాటల ద్వారా అర్ద‌మ‌వుతుంది.

కేరళలోని వాతావరణంపై ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా సత్యం. సినిమా మేకింగ్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న మలయాళ పరిశ్రమకు అక్కడి సంస్కృతే బలమైన పునాది. ఎంతటి ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా? తమ మూలాలను, కళాత్మక విలువలను కాపాడుకోవడంలో కేరళ ఎల్లప్పుడూ భారతదేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.