కెమెరా ముందే కాదు..వెనుక కూడా!
బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ అనగానే ?`దంగల్` సినిమాలో అమ్మడి అద్భుతమైన నటన గుర్తుకొస్తుంది.
By: Srikanth Kontham | 3 April 2026 4:00 PM ISTబాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ అనగానే ?`దంగల్` సినిమాలో అమ్మడి అద్భుతమైన నటన గుర్తుకొస్తుంది.గీతా ఫోగాట్ పాత్రలో ఫాతిమ నటన తో ఒక్కసారిగా ఇండియా వైడ్ ఫేమస్ అయింది. ఆ ఒక్క పాత్ర ఎనలేని గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ విజయం అమ్మడి బాలీవుడ్ జీవితాన్నే మార్చేసింది. నటిగా బిజీ అయింది.
ఈ బ్యూటీ `దంగల్` కంటే ముందు `నువ్వు నేను ఒకటవుదాం` అనే తెలుగు సినిమా కూడా చేసింది. కానీ `దంగల్` హిట్ తో ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదలేదు. ఆసంగతులు పక్కన బెడితే? ఫాతిమ కేవలం న టి మాత్రమే కాదు. కెమెరా వెనుక కూడా అద్భుతాలు సృష్టించగల ప్రతిభావంతురాలు.
ఫాతిమాకు ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. ఆమె తీసే ఫోటోలు చూస్తే? ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ స్థాయిలో ఆమెకు ఈ కళపై ఎంతటి పట్టు ఉందో అర్థమవుతుంది. సాధారణంగా నటీనటులు కెరీర్ ప్రారంభంలో కేవలం నటనకే పరిమితమవుతారు. కానీ ఫాతిమా మాత్రం తనలోని ఇంటర్నల్ స్కిల్స్ కు పదును పెడుతూ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటుంది. ఒకే వృత్తికి లేదా ఉద్యోగానికి పరిమితం కాకుండా నచ్చిన రంగాల్లో రాణించడం వల్ల జీవితం మరింత అర్థవంతంగా ఉంటుందని అమ్మడు నమ్ముతుంది. అందుకే షూటింగ్ గ్యాప్‌లో ఆమె ఎక్కువగా కెమెరా పట్టుకుని ప్రకృతిని, మనుషులను తన కెమారాలో బంధిస్తారుట.
ఫోటోగ్రఫీ అనేది ఫాతిమాకు కేవలం ఒక హాబీ మాత్రమే కాదు. మానసిక ప్రశాంతతను ఇచ్చే మార్గం కూడా. గ్లామర్ ప్రపంచంలో ఉండే ఒత్తిడిని అధిగమించడానికి అమ్మడు ఈ కళను ఆశ్రయిస్తుందిట. నటిగా తాను కెమెరా ముందు ఎలా ఉండాలో తెలుసుకున్నట్లే? ఫోటోగ్రాఫర్‌గా కెమెరా వెనుక నుండి ఒక దృశ్యాన్ని ఎలా ఆవిష్కరించాలో కూడా ఆమెకు బాగా తెలుసు. ఈ రెండింటి కలయిక ఆమెలోని కళాకారిణిని మరింత పరిపూర్ణం చేస్తోంది. జీవితంలో ఎప్పుడూ ఒకే బాటలో వెళ్లకుండా? ఇతర నైపుణ్యాలను కూడా గుర్తించి వాటిని వృత్తిగానో లేదా ప్రవృత్తిగానో మార్చుకోవాలని ఫాతిమా యువతకు సూచిస్తుంది.
`మన దగ్గర కేవలం ఒకే స్కిల్ ఉండాలని రూల్ లేదు. భవిష్యత్తులో నటనతో పాటు ఫోటోగ్రఫీలో కూడా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలి` అని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ వైవిధ్యమైన ఆలోచనా ధోరణి ఆమెను ఇతర నటీమణుల కంటే భిన్నంగా నిలబెడుతోంది. ఒకే రంగంలో స్థిరపడిపోకుండా? మనలోని మల్టీ-టాస్కింగ్ సామర్థ్యాన్ని బయటకు తీయాలని ఆమె నిరూపిస్తున్నారు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక దాగి ఉన్న ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించి ప్రాక్టీస్ చేస్తే జీవితంలో సరికొత్త శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె కెరీర్ గ్రాఫ్ చెబుతోంది. భవిష్యత్తులో ఆమె తీసిన ఫోటోలతో ఒక ఎగ్జిబిషన్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
