Begin typing your search above and press return to search.

న‌టికి గంట‌ల త‌ర‌బ‌డి తిండి తినే అరుదైన వ్యాధి

తాజాగా ఫాతిమ `దంగ‌ల్` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్ను బులిమియా అనే వ్యాధి గురించి మాట్లాడింది.

By:  Sivaji Kontham   |   18 Nov 2025 9:54 AM IST
న‌టికి గంట‌ల త‌ర‌బ‌డి తిండి తినే అరుదైన వ్యాధి
X

`దంగ‌ల్` చిత్రంలో క్రీడాకారిణిగా న‌టించింది ఫాతిమా స‌నా షేక్. ఆ సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే గాక‌, చైనాలో ఇప్ప‌టికీ అత్య‌ధిక వ‌సూళ్లను సాధించిన సినిమాగా రికార్డుల‌కెక్కింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్, సాన్య మ‌ల్హోత్రా త‌దిత‌రులు న‌టించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఫాతిమ `దంగ‌ల్` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్ను బులిమియా అనే వ్యాధి గురించి మాట్లాడింది. త‌న‌కు అతిగా తినే అల‌వాటుంద‌ని, ఒక్కోసారి ఆహారం విషంగా మారిపోతుంద‌ని వెల్ల‌డించి షాకిచ్చింది. అయితే దంగ‌ల్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో రోజూ 3 గంట‌ల పాటు శ్ర‌మించేదానిని.. క‌నీసం గంటన్న‌ర స‌మ‌యం జిమ్ కి కేటాయించేదానిని అని ఫాతిమా చెప్పింది. నేను నిరంత‌రాయంగా గంట‌ల త‌ర‌బ‌డి తిన‌గ‌ల‌ను. సినిమా కోసం 3000 కేల‌రీలు పెర‌గాలి కాబ‌ట్టి బాగా తిన్నాను. కానీ దంగ‌ల్ చిత్రీక‌ర‌ణ అయిపోయాక కూడా అదే విధంగా తిన‌డం కొన‌సాగించాను. ఒకానొక ద‌శ‌లో తిండిపై విసుగొచ్చింది. భ‌యం వేసింద‌ని తెలిపింది.

అంతేకాదు `దంగ‌ల్` సెట్స్ లో త‌న‌కు అతిగా తినే అల‌వాటుంద‌ని స‌హ‌న‌టి సాన్య మ‌ల్హోత్రా గుర్తించిన‌ట్టు అంగీక‌రించింది ఫాతిమా. త‌న‌కు సిగ్గుగా అనిపించింద‌ని కూడా చెప్పింది. కానీ తిండి మాన‌లేని ప‌రిస్థితి.

నిరంత‌రం ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల‌ శ‌రీరం నియంత్రణలో లేదని భావించిన‌ట్టు ఫాతిమా చెప్పింది. గంట‌ల త‌ర‌బ‌డి అతిగా తిన‌డం, ఆక‌లితో ఉండ‌టం అనే స‌మ‌స్య‌ల‌ను తాను ఎదుర్కొన్నాన‌ని తెలిపింది. రెండు విపరీత‌ ప‌రిస్థితితుల‌ మధ్య జీవించాన‌ని అంది. బాగా తిన్న త‌ర్వాత ఆక‌లితో అల‌మ‌టించిన‌ట్టు అనిపిస్తుంది. ఒక సంవత్సరం పాటు బులిమియాతో పోరాడాను అని వెల్ల‌డించింది.

రియా చక్రవర్తితో చాటింగ్ సెష‌న్ లో ఫాతిమా ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఆక‌లి మోడ్ ఆన్ అయితే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి తింటాన‌ని చెప్పింది.నాకు పూర్తిగా నియంత్రణ లేకపోవడంతో నేను ఒక సంవత్సరం పాటు బులిమిక్‌గా ఉన్నాను.. ప్ర‌తి గంటా ఆక‌లి ఆక‌లి అంటూ అల‌మ‌టిస్తాను. బాగా తినేస్తాను. అప్ప‌టికి తిండి గురించి నాకు అంత‌గా అవ‌గాహ‌న లేదు. కానీ ఇప్పుడు తనకు మంచి అవగాహన ఉందని, పరిస్థితులు మారిపోయాయని తెలిపింది.

తిన‌గా తిన‌గా ఒక టైమ్ కి మొద్దుభారిపోయిన‌ట్టు అనిపిస్తుంది. అప్పుడు తిండిని అనుభూతి చెంద‌లేము. తిమ్మిరిత‌నం అనిపిస్తుంది. చివ‌రికి వికారం అనిపిస్తుంది. ఇక‌పై తిన‌కూడ‌ద‌ని అనుకుంటాం. అయితే ఎప్ప‌టిలాగే అధిక‌మొత్తంలో కేల‌రీలు తీసుకోక‌పోతే అది బులిమియాకు దారి తీస్తుంద‌ని కూడా చెప్పింది. ఈ బులిమియా అత్యంత హానిక‌రం అని వెల్ల‌డించింది. ఫాతిమ‌- విజ‌య్ వ‌ర్మ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `గుస్తాక్ ఇష్క్` త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. ఈ చిత్రంలో న‌సీరుద్ధీన్ షా ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.