భారతీయ యువతకు పాకిస్తానీ అందగత్తె వల?
ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ పాకిస్తానీ ప్రభావశీలి ఫాతిమా జటోయ్ వీడియో వైరల్ గా మారుతోందనే ఫిర్యాదు అందినట్టు సమాచారం.
By: Sivaji Kontham | 17 Jan 2026 8:15 AM ISTప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ పాకిస్తానీ ప్రభావశీలి ఫాతిమా జటోయ్ వీడియో వైరల్ గా మారుతోందనే ఫిర్యాదు అందినట్టు సమాచారం. పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫాతిమా జటోయ్ పేరుతో వైరల్ అవుతున్న `6 నిమిషాల 39 సెకన్ల` వీడియో ప్రకంపనాలు రేపుతోందనేది సైబర్ పోలీసుల హెచ్చరిక.
అయితే ఈ వీడియో డీప్ ఫేక్ వీడియో అంటూ సదరు నటీమణి వాపోతోంది. ఫాతిమా జటోయ్‌కు సంబంధించి ఎలాంటి `ఒరిజినల్` ప్రైవేట్ వీడియో లేదు. ఇది పూర్తిగా AI (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అని సైబర్ నిపుణులు తేల్చారు.
ఈ వార్తలపై ఫాతిమా జటోయ్ స్పందిస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తనను కావాలనే కొందరు బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన చేతిలో పవిత్ర ఖురాన్ పట్టుకుని, ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన వీడియో కూడా వైరల్ అయింది.
6 నిమిషాల 39 సెకన్లు వీడియో లింక్‌లను సోషల్ మీడియాలో (X, టెలిగ్రామ్) ప్రచారం చేయడం సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ. ఈ లింక్‌లపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది లేదా మాల్వేర్ మీ డివైజ్‌లోకి ప్రవేశించవచ్చు. ఇలాంటి అశ్లీల లేదా ప్రైవేట్ వీడియోల పేరుతో వచ్చే లింక్‌లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి పన్నిన వల. సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని చిన్న క్లిప్‌లు పాత ట్రావెల్ వ్లాగ్‌ల నుండి లేదా ఇతర వీడియోల నుండి కట్ చేసినవి.
ఇలాంటి టైమ్-కోడ్ ఉన్న కీవర్డ్స్‌తో సెర్చ్ చేయడం వల్ల మీ ఆన్‌లైన్ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆ 6:39 వీడియోలో ఎలాంటి వాస్తవం లేదు. అది కేవలం క్లిక్‌ల కోసం, డేటాను దొంగిలించడానికి సృష్టించిన తప్పుడు ప్రచారం మాత్రమేనని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
