Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : చీర కట్టులో చిట్టి బ్యూటీ

ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఫరియా రెగ్యులర్‌గా తన ఫాలోవర్స్ కోసం అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది.

By:  Ramesh Palla   |   14 Sept 2025 3:00 AM IST
పిక్‌టాక్ : చీర కట్టులో చిట్టి బ్యూటీ
X

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాదీ అమ్మాయి ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం చాలా కాలం వెయిట్‌ చేసింది. ఎన్నో విధాలుగా చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యి జాతిరత్నాలు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. మొదటి సినిమానే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా హీరోయిన్‌గా, ముఖ్యంగా నటిగా ఫరియాకు జాతిరత్నాలు సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది. హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా మరిన్ని సినిమా ఆఫర్లు దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ జాతిరత్నాలు సినిమా తర్వాత అడపా దడపా మాత్రమే సినిమా ఆఫర్లు వచ్చాయి. కేవలం తెలుగు అమ్మాయి అనే కారణంగానే ఫరియాను ఇండస్ట్రీకి దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆమె అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో..

గత ఏడాది ఆ ఒక్కటీ అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2 సినిమాలతో వచ్చిన ఈ అమ్మడు ఈ ఏడాదిలో ఇప్పటివరకు తన ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయింది. కల్కి సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసినప్పటికీ గుర్తుండి పోయే పాత్రలో కనిపించింది. మిగిలిన రెండు సినిమాలతో గత ఏడాదిలో ఫరియా బలమైన ముద్ర వేసింది. కానీ ఆ రెండు హిట్స్ కూడా ఫరియాకు ఆఫర్లు తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇటీవల ఒక సినిమా ఆఫర్‌ వచ్చినప్పటికీ అది లేడీ ఓరియంటెడ్‌ మూవీ కావడంతో ఫరియా కాస్త ఆలోచనలో పడిందనే పుకార్లు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే ఫరియా స్టార్‌ హీరోల సినిమాల్లో కనీసం ఐటెం సాంగ్స్ ఆఫర్స్‌ అయినా వస్తాయని ఎదురు చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

ప్రభాస్ కల్కి సినిమాలో ఫరియా అబ్దుల్లా

హీరోయిన్‌గా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ఫరియా అబ్దుల్లా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఫరియా రెగ్యులర్‌గా తన ఫాలోవర్స్ కోసం అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో స్కిన్‌ షో ఫోటోలు షేర్‌ చేశాం, అందంగా కనిపించేందుకు ఏవో ఔట్‌ ఫిట్‌ ధరించాం అన్నట్లుగా కాకుండా ఫరియా చాలా క్రియేటివ్‌గా ఔట్‌ ఫిట్స్ ను ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం కావడంతో ఎలాంటి ఔట్‌ ఫిట్‌లో అయినా ఆకట్టుకుంటుంది.

అందాల ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫరియా అబ్దుల్లా వైరల్‌

తాజాగా ఈమె చీర కట్టి కాస్త అటు ఇటుగా సీనియర్‌ హీరోయిన్‌ శోభన మాదిరిగా కనిపించే విధంగా మేకోవర్‌ చేసుకుంది. చూడగానే శోభన పాత ఫోటోలు చూసినట్లుగా అనిపిస్తుంది. అంతే కాకుండా శోభన మాదిరిగా అందంగానూ ఫరియా ఉంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చీర కట్టి పైట కొంగు జార విడ్చడంతో కొందరు విమర్శలు చేస్తున్నారు. చీర కట్టి ఇంత అందంగా ఉన్న చిట్టీ ఇదేం పని అని కొందరు కామెంట్ష్ చేస్తున్నారు. మొత్తానికి ఫరియా అబ్దుల్లా తన అందంతో ఆకట్టుకోవడంతో పాటు, తన స్కిన్‌ షో తో వైరల్‌ అయింది. ముందు ముందు అయినా ఇలాంటి ఫోటోల కారణంగా ఈమెకు సినిమాల్లో ఆఫర్లు మరిన్ని వస్తాయేమో చూడాలి. ఫరియా అబ్దుల్లా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రయత్నిస్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం.