Begin typing your search above and press return to search.

సినిమాల్లోకి వ‌చ్చాక ఫ‌రియా జీవితంలో అతిపెద్ద మార్పు!

టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ `జాతి రత్నాలు` సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఫరియా అబ్దుల్లా.. ఇటీవల తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Sivaji Kontham   |   27 April 2026 4:00 AM IST
సినిమాల్లోకి వ‌చ్చాక ఫ‌రియా జీవితంలో అతిపెద్ద మార్పు!
X

టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ `జాతి రత్నాలు` సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఫరియా అబ్దుల్లా.. ఇటీవల తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి వచ్చాక తన జీవితంలో జరిగిన అతిపెద్ద మార్పు `రిచ్` గా మారడమేనని నిజాయితీగా అంగీక‌రించారు. ఒకప్పుడు షాపింగ్‌కు వెళ్తే ప్రతి వస్తువు ధర చూసి కొనేదాన్నని.. కానీ ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ చూడాల్సిన అవసరం లేకుండా నచ్చింది కొనే స్థాయికి చేరానని తన ఆర్థిక ఎదుగుదలపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం గ్లామర్ కోణంలోనే కాకుండా.. తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పే చిట్టి ఫ‌రియా వ్యక్తిత్వం అభిమానులను ఆకట్టుకుంటోంది.

హైదరాబాద్‌కు చెందిన ఈ తెలుగమ్మాయి కెరీర్ ప్రయాణం థియేటర్ ఆర్ట్స్ (నాటక రంగం) నుంచి మొదలైంది. కళాకారిణిగా మంచి గుర్తింపు ఉన్న ఫరియా.. తన ఎత్తు.. విలక్షణమైన నటనతో తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా `బంగార్రాజు`, `లైక్ షేర్ సబ్‌స్క్రైబ్‌`, `ఆ ఒక్కటి అడక్కు` వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో మెప్పించింది. చిట్టి ఫ‌రియాలోని సహజమైన వాచకం.. ఈజ్ ఎన‌ర్జీ కామెడీ టైమింగ్ త‌న‌ను ఇతర నటీమణుల కంటే భిన్నంగా నిలబెట్టాయి.

ఫరియా అబ్దుల్లాను చూడగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ ఒడ్డు పొడుగు.. సుమారు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుతో టాలీవుడ్‌లో అతి కొద్దిమంది హీరోయిన్లకే ఉన్న ఫిజిక్ త‌న‌ సొంతం. ఈ హైట్ ప్రభాస్, అల్లు అర్జున్, మ‌హేష్ వంటి అగ్ర హీరోలకు సరైన జోడీగా సరిపోతుంది. స్విమ్మింగ్ పూల్‌లో బికినీలు, మోనోకినీల్లో గ్లామర్ ఒలకబోయడమే కాకుండా.. అద్భుతమైన డాన్సింగ్ టాలెంట్‌తో దుమ్మురేపగలదు. నటన, అభినయం, డాన్స్ ఇలా అన్ని అర్హతలు ఉన్నా మన స్టార్ హీరోలు ఇంకా ముంబై, బెంగళూరు లేదా కేరళ భామల వైపే మొగ్గు చూపడం విచారకరం. మన ఇంటి పక్కన ఉన్న ప్రతిభ కంటే పొరుగు రాష్ట్రాల నుంచి వస్తేనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందనే భావన మన మేకర్స్‌లో ఇంకా పోలేదు.

తెలుగు సినీ పరిశ్రమలో స్థానిక నటీమణులకు అవకాశాలు తక్కువగా ఉండటం పాత సమస్యే అయినా.. ఫరియా విషయంలో అది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మల్లు బ్యూటీ కంటే ఫరియాకు ఏమీ తక్కువ లేకపోయినా.. అగ్ర హీరోల సరసన ఈ బ్యూటీకి పెద్ద ఆఫర్లు రాకపోవడం వెనుక దర్శకులకు, హీరోలకు ఇంకేం కావాలో అర్థం కావడం లేదనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేవలం `పక్క రాష్ట్రం` అనే ట్యాగ్ లేకపోవడమే ఫ‌రియాకు శాపంగా మారిందా? లేక ఆమె ఎత్తుకు సరిపడా పాత్రలు రాయలేకపోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా నిరాశ చెంద‌క తెలుగ‌మ్మాయి ఫరియా తనదైన ప్ర‌తిభ‌తో ప్ర‌య‌త్నాల‌ను ఆప‌డం లేదు.

ప్ర‌స్తుతానికి ఫ‌రియా కెరీర్ కి ఢోఖా ఏమీ లేదు. ఓ రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి మాస్ ఎంటర్‌టైనర్ కాగా, మరొకటి మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న కథ. వీటితో పాటు కొన్ని క్రేజీ వెబ్ సిరీస్‌లలో న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు సమాచారం. న‌వీన్ పోలిశెట్టితో `అన‌గ‌న‌గా ఒక రాజు` త‌ర్వాత ఫ‌రియా కొన్ని వెర్స‌టైల్ క‌థ‌ల‌ను ఎంచుకుంద‌ని తెలుస్తోంది.