మత్స్య కన్యగా ఫరియా అబ్దుల్లా.. చీరలో చిలిపితనం!
టాలీవుడ్‌కి జాతిరత్నాలు వంటి బ్లాక్‌బస్టర్ మూవీ ద్వారా పరిచయమైన ఫరియా అబ్దుల్లా, మొదటి సినిమా నుంచే తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది.
By: M Prashanth | 29 July 2025 1:30 PM ISTటాలీవుడ్‌కి జాతిరత్నాలు వంటి బ్లాక్‌బస్టర్ మూవీ ద్వారా పరిచయమైన ఫరియా అబ్దుల్లా, మొదటి సినిమా నుంచే తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది. కేవలం హాస్య భరిత పాత్రలకే కాదు, ఫ్యాషన్, గ్లామర్ విభాగాల్లోనూ ఆమె తనదైన స్టయిల్‌తో చూపిస్తోంది. తాజాగా ఫరియా షేర్ చేసిన చీరలోని గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.
ట్రాన్స్‌పరెంట్ స్టైలిష్ చీరలో ఫరియా వేసిన హావభావాలు అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. “మత్స్యకన్య వైబ్స్” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌కు తగ్గట్టే, ఆమె ఈ లుక్‌లో ఒక అందమైన జలకన్యలా మెరిసిపోతోంది. చీరతోపాటు స్లీవ్‌లెస్ బ్లౌజ్, లాంగ్ హెయిర్, కాంతివంతమైన మేకప్ ఆమె లుక్‌ని మరింత హైలైట్ చేశాయి. కెమెరా ముందు సునాయాసంగా ఇచ్చిన పోజులు చూసి ఫ్యాషన్ ప్రేమికులు ఫిదా అవుతున్నారు.
ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది. అయినా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్సింగ్ స్కిల్స్, మరియు కమెడియన్ టైమింగ్ కారణంగా ప్రేక్షకుల్లో ఓ స్థిరమైన క్రేజ్‌ను నిలుపుకుంటోంది. ఇటీవల కొన్ని ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ కనిపించిన ఫరియా, కథల ఎంపికలో తనదైన దృష్టిని చూపుతోంది.
ఫరియా కెరీర్‌కి ఈ ఫోటోషూట్స్ ఓ వెరైటీ అడ్డా లాగా మారుతున్నాయి. గ్లామరస్ లుక్స్‌తో పాటు ట్రెడిషనల్ డ్రెస్‌లలోనూ ఆమె కనిపిస్తూ, తనలోని గ్లామర్‌కి కొత్తగా నిర్వచనం ఇస్తోంది. ఒక క్రేజీ సీక్వెల్ లో నటిస్తుందన్న వార్తలు ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తున్నాయి. దానికి తోడు ఈ లుక్‌తో ఆమె ట్రెండ్ సెట్ చేయడం ఫ్యాషన్ వర్గాల్లో హైలైట్ అవుతోంది. చూస్తుంటే త్వరలోనే ఈ మత్స్యకన్య ముందు మరిన్ని అవకాశాలు క్యూ కట్టడం ఖాయమే.
