Begin typing your search above and press return to search.

భిన్నమైన ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా!

'జాతిరత్నాలు' సినిమాలో తన అమాయకత్వంతో 'చిట్టి'గా అందరి మనసులు దోచుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు రూట్ మార్చింది.

By:  Madhu Reddy   |   13 March 2026 3:20 PM IST
భిన్నమైన ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా!
X

'జాతిరత్నాలు' సినిమాలో తన అమాయకత్వంతో 'చిట్టి'గా అందరి మనసులు దోచుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు రూట్ మార్చింది. ఆరడుగుల పొడవుతో, చూడచక్కని రూపంతో అలరించిన ఈ సుందరి, ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. పద్ధతిగా కనిపించే చిట్టి సడెన్‌గా గ్లామర్ గేర్ మార్చడంతో నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. టాలెంట్ పుష్కలంగా ఉన్నా, సరైన బ్రేక్ కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మ చేస్తున్న తాజా ఫోటోషూట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే ..





చిట్టి ఇన్నోసెన్స్ నుండి గ్లామర్ లుక్స్ దాకా.. ఫరియా మేకోవర్:

జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా, ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అందుకే కాబోలు, ఈ పొడుగుకాళ్ల సుందరి ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోమ్లీగా కనిపించిన ఫరియా, ఇప్పుడు గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆమె లేటెస్ట్ షాట్ డ్రెస్ ఫోటోలు చూస్తుంటే, ఇండస్ట్రీ వర్గాలకు సైతం మైండ్ బ్లాక్ అవుతోంది. అవకాశాల కోసం తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నంలో ఫరియా చేస్తున్న ఈ మేకోవర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.





టాలెంట్ ఉన్నా కలిసి రాని అదృష్టం:

నిజానికి ఫరియా మంచి నటి మాత్రమే కాదు, గ్రేట్ డ్యాన్సర్ కూడా. మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా అనుభవం ఉన్న ఈమెకు టాలీవుడ్‌లో ఆశించిన గుర్తింపు రాకపోవడం విచారకరం. మన దగ్గర పరభాషా భామలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగమ్మాయిలకు దక్కడం లేదనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, చివరకు కల్కి 2898 AD వంటి సినిమాల్లో మెరిసినా అవి కేవలం క్యామియో పాత్రలకే పరిమితమయ్యాయి. హీరోయిన్‌గా నటించిన రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు వంటి సినిమాలు నిరాశపరచడంతో, ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ బాట పట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.





కెరీర్ మారే బ్రేక్ ఎప్పుడు?:

ఇటీవల వచ్చిన మత్తు వదలరా 2 సినిమాలో ఫరియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక గత ఏడాది వచ్చిన గుర్రం పాపి రెడ్డి సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా, ఆమె కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసే స్థాయిలో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్‌ను బయటకు తీసి పెద్ద హీరోల కంట పడాలని చూస్తోంది. చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నా, స్టార్ హీరోల సరసన ఒక్క ఛాన్స్ దక్కితే ఫరియా రేంజ్ మారిపోవడం ఖాయం. ఆ బ్రేక్ కోసమే ఎదురుచూస్తూ సోషల్ మీడియా వేదికగా తన అందచందాలను ఆరబోస్తూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది మన హైదరాబాదీ చిట్టి.