ఒకే రోజున ఫరియా రెండు సినిమాలు.. కానీ!
మే1 టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఆసక్తికరమైన తేదీగా మారుతోంది. మిడ్‌రేంజ్ కేటగిరీలో వస్తున్న రెండు సినిమాలు గాయపడ్డ సింహం, జెట్లీ ఒకే రోజు విడుదలకు సిద్ధమవ్వడం వల్ల పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.
By: Sravani Lakshmi Srungarapu | 24 April 2026 9:08 AM ISTమే1 టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఆసక్తికరమైన తేదీగా మారుతోంది. మిడ్‌రేంజ్ కేటగిరీలో వస్తున్న రెండు సినిమాలు గాయపడ్డ సింహం, జెట్లీ ఒకే రోజు విడుదలకు సిద్ధమవ్వడం వల్ల పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. స్టార్ సినిమాల గ్యాప్‌లో ఇలా చిన్న, మధ్యస్థాయి సినిమాలు నేరుగా పోటీపడటం ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న ట్రెండ్.
అయితే ఈ పోటీలో ప్రత్యేకంగా నిలుస్తున్న అంశం ఫరియా అబ్దుల్లా డబుల్ రిలీజ్. ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఏ నటికి అయినా అరుదైన సందర్భం. జాతి రత్నాలు తర్వాత తనకు వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫరియాకు ఇది కీలక మలుపుగా చెప్పొచ్చు. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, జెట్లీ మూవీలో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్‌గా కనిపించడం లేదు, ఆమె కేవలం హీరోయిన్ కు డబ్బింగ్ మాత్రమే చెప్పిందనే అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంటే ఒక సినిమా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌పై ఆధారపడితే, మరొకటి కేవలం వాయిస్ ప్రెజెన్స్‌కే పరిమితం కావడం ఆసక్తికరమైన కాన్ట్రాస్ట్‌ను తీసుకొచ్చింది.
ప్రమోషన్స్ పరంగా చూస్తే, ఈ రెండు సినిమాలు పూర్తిగా విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. గాయపడ్డ సింహం టీమ్ ఏఐ ఆధారిత వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో బలమైన బజ్ సృష్టించగా, జెట్లీ టీమ్ సెటైరికల్, సెల్ఫ్-అవేర్ వీడియోలతో యూత్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈ రెండు స్ట్రాటజీలు కూడా తమ తమ స్థాయిలో ఆకట్టుకున్నా, అసలు పరీక్ష మాత్రం థియేటర్‌లోనే జరగనుంది.
అయితే ఫరియా అబ్దుల్లా కు ఇది నిజంగా డూ ఆర్ డై సిట్యుయేషన్ గా చెప్పవచ్చు. ఒకే రోజు రెండు రిలీజ్‌లు రావడం వల్ల విజిబిలిటీ పెరుగుతుందనే మాట నిజమే. కానీ అదే సమయంలో, అటెన్షన్ స్ప్లిట్ అవ్వడం కూడా పెద్ద రిస్క్. ఒక సినిమా సక్సెస్ సాధిస్తే ఆమె కెరీర్‌కు కొత్త ఊపిరి లభించే అవకాశం ఉంది. కానీ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే, ఆమె కెరీర్ మళ్లీ స్లోడౌన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జెట్లీ లో ఆమె కేవలం డబ్బింగ్ మాత్రమే ఇవ్వడం వల్ల, ఆ సినిమా హిట్ అయినా కూడా పూర్తి క్రెడిట్ ఆమెకు ఎంతవరకు వస్తుందన్నది ప్రశ్నార్థకమే.
ఇక కంటెంట్ విషయంలో మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉన్నారు. ప్రమోషన్స్ ఎంత వైరల్ అయినా, మొదటి షో తర్వాతే అసలు తీర్పు వెలువడుతుంది. కథ, ట్రీట్‌మెంట్, ఎమోషనల్ కనెక్ట్.. ఇవే చివరికి సినిమా భవిష్యత్తును నిర్ణయించే అంశాలు. అందుకే ఈ క్లాష్‌ను కేవలం మార్కెటింగ్ పోటీగా కాకుండా, కంటెంట్ స్ట్రెంగ్త్‌కు సంబంధించిన పరీక్షగా కూడా చూడాలి. మొత్తంగా, మే 1 బాక్సాఫీస్ పోటీ రెండు సినిమాల మధ్య పోరాటం మాత్రమే కాదు. ఇది ఫరియా కెరీర్‌కు కీలక మలుపు.
