ఫ్యాషన్ ఐకాన్ ఫరియా అబ్దుల్లా కిల్లర్ లుక్
కేవలం ఐదేళ్లలో ఇండస్ట్రీలో ఎంతో తెలివిగా సెలక్టివ్ గా కెరీర్ బండిని నడిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ భామ. పూర్తి వివరాల్లోకి వెళితే..
By: Sivaji Kontham | 25 July 2026 12:09 AM ISTచిట్టి ఫరియాగా తెలుగు వారి గుండెల్లో స్థిరపడిపోయింది ఫరియా అబ్ధుల్లా. కేవలం ఐదేళ్లలో ఇండస్ట్రీలో ఎంతో తెలివిగా సెలక్టివ్ గా కెరీర్ బండిని నడిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ భామ. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గ్లామర్ అండ్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ తనదైన మార్కును చూపిస్తూనే ఉంటుంది. ఇటీవల `డాన్స్ ఐకాన్ సీజన్ 2` వేదికపై ఈ భామ ధరించిన కస్టమ్ మేడ్ డెనిమ్ చీర సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాంప్రదాయ చీరకట్టుకి భిన్నంగా... స్ట్రీట్‌వేర్ యాటిట్యూడ్‌తో డెనిమ్ మెటీరియల్.. బూట్స్ -బెల్ట్‌లతో ఐశ్వర్య డిజైన్ చేసిన ఈ ఫ్యూజన్ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. శక్తి స్మరణ్ ఫోటోగ్రఫీ, అనుషా అలీ మేకప్‌లో ఫరియా సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను క్రియేట్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిట్టి కిల్లర్ లుక్ అదిరిపోయిందంటూ కితాబు దక్కింది.
ఫరియా అబ్దుల్లా 2026లో కూడా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది `అనగనగా ఒక రాజు` చిత్రంలో పీతాంబరిగా కామియో పాత్రలో మెరవగా, `గాయపడ్డ సింహం` చిత్రంలో షాలిని అనే బలమైన పాత్రతో అలరించింది. వీటితో పాటు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న `సిగ్మా`లోనూ ఫరియా కీలక పాత్ర పోషిస్తోంది. నటనలోనే కాకుండా డాన్స్, పాటల రచన, సింగింగ్‌లోనూ ప్రయోగాలు చేస్తూ తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది.
ప్రత్యేకించి ఫరియా నటిస్తున్న `సిగ్మా` సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధమవుతోంది. ఈ తమిళ-తెలుగు ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ లో ఫరియా అబ్దుల్లాతో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఒక సరికొత్త కాన్సెప్ట్, సమాజంలో వైవిధ్యమైన నేపథ్యం ఉన్న పాత్రల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తమిళంలో కూడా ఫరియా బలమైన పునాది వేసుకోవాలని భావిస్తోంది.
ఈ ఐదేళ్లలో సాధించింది ఏమిటి?
2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ `జాతి రత్నాలు` సినిమాలో `చిట్టి` (అడ్వకేట్ షామిలి) పాత్రతో కెరీర్ ప్రారంభించిన ఫరియా.. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు ఏడెనిమిది సినిమాలలో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బంగార్రాజు, లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, కల్కి 2898 AD, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి.. ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. నటిగా మాత్రమే కాకుండా కొరియోగ్రాఫర్‌గా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంది. తొలి చిత్రంతోనే విశేష గుర్తింపు తెచ్చుకుని... ఐదేళ్లలో ఇన్ని విభిన్నమైన ప్రాజెక్ట్‌లలో భాగమవ్వడం ఒక నటిగా గొప్ప విషయమేనని చెప్పవచ్చు.
అయితే ఫరియాలో ఉన్న అపారమైన ప్రతిభ, స్క్రీన్ ప్రెజెన్స్, కమాండింగ్ పర్సనాలిటీకి తగినట్లుగా పరిశ్రమలో తనకు మరింత పెద్ద అవకాశాలు, సోలో హిట్ చిత్రాలు రావాల్సి ఉందనేది విశ్లేషకులు- అభిమానుల అభిప్రాయం. కేవలం కామియోలు, సెకండ్ లీడ్ లేదా సపోర్టింగ్ పాత్రలకే పరిమితం చేయకుండా... తనలోని పూర్తి స్థాయి నటిని బయటకు తీసే విధంగా ప్రధాన పాత్రలతో కూడిన లీడ్ ఆఫర్లు ఇస్తే ఫరియా స్టార్ గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది.
