Begin typing your search above and press return to search.

"బాసింగ బలాలే" పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఫరియా అబ్దుల్లా!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఆల్బమ్ సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది.

By:  Madhu Reddy   |   5 Oct 2026 12:29 AM IST
బాసింగ బలాలే పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఫరియా అబ్దుల్లా!
X

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఆల్బమ్ సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఫోక్ సాంగులు ఎన్నో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ ఫోక్ సాంగ్ లకు సామాన్యులు రీల్స్ చేస్తుంటే.. తామేమి తక్కువ కాదు అంటూ సెలబ్రిటీలు కూడా అదిరిపోయే స్టెప్పులేస్తూ.. అభిమానులలో సరికొత్త జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ గా, డాన్సర్ గా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన ఫోక్ సాంగ్ "బాసింగ బలాలే" పాటకు తనదైన శైలిలో డాన్స్ చేసి ఆకట్టుకుంది.

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలయికలో వచ్చిన ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే ఇదే పాటకు ఫరియా అబ్దుల్లా తనదైన స్టెప్పులతో డాన్స్ చేసి ఆకట్టుకుంది. మొత్తానికి అయితే తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా డాన్స్ ని చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. మేడం ఈ పాట మీరు చేయాల్సింది అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పైగా ఈ పాటలో ఆమె ధరించిన అవుట్ ఫిట్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. రెడ్ కలర్ డీప్ ఫ్రంట్ వీ నెక్ కలిగిన డ్రెస్ తో పాటు అందంగా గ్రీన్ కలర్ సారీ కట్టుకొని రెండు విభిన్నమైన ఔట్ఫిట్స్ లో ఈ పాటకు స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది ఫరియా. మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫరియా అబ్దుల్లా 1998 మే 28న హైదరాబాద్ లోని బంజారా హిల్స్లో జన్మించింది. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ లో పట్టా అందుకున్న ఈమె.. సినిమాలోకి రాకముందే మోడలింగ్ చేసింది. థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా కూడా పలు వీడియోలు చేసి, ఆడియన్స్ కి దగ్గర అయింది. తొలిసారి నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో నటించి తన నటన జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. 2021లో స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమాలో చిట్టి గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నరేష్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఇందులో ఈమె పాత్రకు పలువురు సెలబ్రిటీలు కూడా ముగ్ధులయ్యారు. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల హైట్ తో సమానంగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది ఫరియా. ఈ సినిమా తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో మీనాక్షి అనే గెస్ట్ రోల్ దగ్గర నుండి బంగార్రాజు సినిమాలో వాసివాడి తస్సాదియా అనే ప్రత్యేక పాట వరకు అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ , రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె చివరిగా గాయపడ్డ సింహం సినిమాలో నటించింది.. మరొకవైపు వల్లిమయిల్ చిత్రంతోపాటు భగవంతుడు అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తొలి దర్శకత్వంలో వచ్చిన సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా నటించి పర్వాలేదనిపించుకుంది.