Begin typing your search above and press return to search.

హీరోల కోసమే హీరోయిన్లా? మా దగ్గర ఎప్పుడూ అంతే!: బాలీవుడ్ నటుడు

తమ దగ్గర నటీమణులను సినిమాల్లో ఎలా చూపిస్తారన్న విషయంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

By:  M Prashanth   |   26 Nov 2025 2:00 AM IST
హీరోల కోసమే హీరోయిన్లా? మా దగ్గర ఎప్పుడూ అంతే!: బాలీవుడ్ నటుడు
X

బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తమ దగ్గర నటీమణులను సినిమాల్లో ఎలా చూపిస్తారన్న విషయంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు.. అటు నెట్టింట.. ఇటు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రీసెంట్ గా ఆయన 120 బహదూర్ మూవీ చేయగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో హోస్ట్.. మీకు ఇండస్ట్రీ నచ్చని అంశమేంటని అడగ్గా.. కొన్ని సినిమాల్లో మహిళలను చూపించే తీరు తను తీవ్రంగా బాధిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఆ విషయాన్ని తాను పలువురికి చెప్పినట్లు వెల్లడించారు.

అయితే వారిలో కొందరు దాన్ని అంగీకరించి.. మార్పు అవసరమని కూడా అన్నట్లు చెప్పారు. నిజానికి చాలా సినిమాల్లో హీరోయిన్స్ ను కేవలం మేల్ రోల్స్ కోసమే అన్నట్లు పాత్రలను డిజైన్ చేస్తున్నారని ఆరోపించారు. హీరోను గొప్పగా చేయడానికి మాత్రమే హీరోయిన్స్ ను యూజ్ చేస్తున్నారని, ఇది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లను విలన్లు మాత్రమే వేధించేవారని అన్న ఫర్హాన్ అక్తర్.. ఇప్పుడు రోల్స్ రాసుకునే విధానం మొత్తం మారిపోయిందని తెలిపారు. ఇప్పుడు చిత్రాల్లో హీరోలే ఫిమేల్ రోల్స్ ను ఇబ్బంది పెట్టే సీన్స్ ను చేస్తున్నారని అన్నారు. అంతే కాదు.. దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా చూపిస్తున్నారని ఆరోపించారు.

అలా చేయడం వల్ల యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఫర్హాన్ హెచ్చరించారు. ఎందుకంటే ఆయా హీరోలకు చాలా ఫ్యాన్ బేస్ ఉంటుందని, కాబట్టి అభిమానులు కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలా మాత్రం జరిగితే చాలా డేంజర్ అని ఫర్హాన్ అక్తర్ వ్యాఖ్యానించారు.

అయితే ఆ విషయంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. తప్పుడు మెసేజ్ ఇచ్చిన సినిమాలను ఎందుకు పట్టించుకోరని క్వశ్చన్ చేశారు. ఒకవేళ వాస్తవాన్ని చూపించాల్సిన అవసరం వచ్చినా.. నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా చూసుకోవాలని సూచించారు. కానీ అలా చేయకుండా సినిమాలు తీయడం తప్పు అని, ఫిల్మ్‌ మేకర్లపై ఆ బాధ్యత ఉందని అన్నారు. మొత్తానికి ఫర్హాన్ కామెంట్స్ వైరల్ గా మారగా... అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.