Begin typing your search above and press return to search.

15 ఏళ్లు అవుతుంద‌ని ప‌ని చేయ‌లేన‌నుకున్నారా?

ద‌ర్శ‌క‌త్వం వ‌హించి 15 ఏళ్లు అవ్వ‌డంతోనే ఈ ర‌క‌మైన ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ నేను ప‌నిచేస్తానా? లేదా? అన్న‌ది మాత్రం ఎవ‌రూ ఆలోచించ‌లేక‌పోయారు.

By:  Srikanth Kontham   |   25 Nov 2025 2:00 AM IST
15 ఏళ్లు అవుతుంద‌ని ప‌ని చేయ‌లేన‌నుకున్నారా?
X

బాలీవుడ్ మ‌ల్టీట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ ప‌ర్హాన్ అక్త‌ర్. న‌టుడిగా, డైరెక్ట‌ర్ గా, గాయ‌కుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటిన ప్ర‌తిభావంతుడు. తొలుత డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన ప‌ర్హాన్ అక్త‌ర్ కాల‌క్ర‌మంలో న‌టుడిగా ఎదిగాడు. న‌ట‌న‌తో పాటు తాను సంపాదించిందంతా? అక్క‌డే ఖ‌ర్చు చేయాల‌ని నిర్మాత అయ్యాడు. వీటితో పాటు గాయ‌కుడిగానూ సేవ‌లందించాడు. ఐదారు సినిమాల‌ను డైరెక్ట్ చేసాడు. డైరెక్ష‌న్ లోనూ ప‌ర్హాన్ స‌త్తా చాటాడు. `ల‌క్ష్య‌`, `డాన్` లాంటి హిట్ సినిమాలు తెర‌కెక్కించాడు. చివ‌రిగా 2011లో `డాన్ 2` తెర‌కెక్కించాడు. ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది.

మాన‌సికంగా ప్ర‌భావితం:

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌ర్హాన్ అక్త‌ర్ కెప్టెన్ కుర్చీ ఎక్క‌లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ప్రియాంక చోప్రా, క‌త్రినా కైఫ్, అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో `జీలే జ‌రా` అనే చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. అయితే సినిమా చిత్రీక‌ర‌ణ అనంత‌రం కొన్ని కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే బ్రేక్ ప‌డింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగింది. ప‌ర్హాన్ డీల్ చేయ‌డంలో వైఫ‌ల్యం చెంద‌డంతోనే ఆగిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. తాజాగా ఈ ప్ర‌చారాల‌పై ప‌ర్హాన్ అక్త‌ర్ స్పందించాడు. ఈ ర‌క‌మైన ప్ర‌చారాలు, ఆగిపోయిందన్న కార‌ణాలు త‌న‌ని మాన‌సికంగా ప్ర‌భావితం చేసాయన్నాడు.

ఆ ప్రాజెక్ట్ పున ప్రారంభం:

ద‌ర్శ‌క‌త్వం వ‌హించి 15 ఏళ్లు అవ్వ‌డంతోనే ఈ ర‌క‌మైన ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ నేను ప‌నిచేస్తానా? లేదా? అన్న‌ది మాత్రం ఎవ‌రూ ఆలోచించ‌లేక‌పోయారు. ఇంత గ్యాప్ వ‌చ్చిన త‌ర్వాత ప‌నిచేయ‌లేను అన్న వాళ్లంద‌రికీ త్వ‌ర‌లోనే త‌న స‌మాధానం ఉంటుంద‌న్నారు. ఆగిపోయిన ప్రాజెక్ట్ మ‌ళ్లీ ప్రారంభం అవ్వ‌ద‌నుకుం టున్నారు. కానీ నేను ఆ ప్రాజెక్ట్ ఆప‌లేదు. త్వ‌ర‌లోనే మొద‌లు పెడ‌తాను. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. స్రిప్ట్ బాగా వ‌చ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ వ‌దిలేయాల‌నుకోవ‌డం లేద‌ని తెలిపారు.

రెండేళ్ల త‌ర్వాత వెండి తెర‌పై:

దీంతో పాటు ఓ స్టార్ హీరోతో కూడా ప‌ర్హాన్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప‌ర్హాన్ అక్త‌ర్ న‌టుడిగా కంటే నిర్మాత‌గా బిజీగా ఉన్నాడు. రెండేళ్ల కాలంగా నిర్మాత‌గానే త‌న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్ప‌టికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటి ఫ‌లితాలు మాత్రం నిరాశ‌ప‌రిచాయి. ఇటీవ‌లే న‌టుడిగా, నిర్మాత‌గా చేసిన `120 బహ‌దూర్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయింది. కానీ ఆ రేంజ్ లో అంచ‌నాలు మాత్రం అందుకోలేదు. ప‌ర్హాన్ అక్త‌ర్ న‌టుడిగా రెండేళ్ల త‌ర్వాత న‌టించిన చిత్రం కూడా ఇదే. మ‌రోవైపు టెలివిజ‌న్ షోలు కూడా హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.