Begin typing your search above and press return to search.

వరద బాధితుల కోసం స్టార్ డైరెక్టర్ గొప్ప మనసు.. ఏం చేశారంటే?

బహుముఖ ప్రజ్ఞశాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఫర్హాన్ అక్తర్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు.

By:  Madhu Reddy   |   25 Aug 2025 4:11 PM IST
వరద బాధితుల కోసం స్టార్ డైరెక్టర్ గొప్ప మనసు.. ఏం చేశారంటే?
X

బాలీవుడ్ నటుడు.. దర్శకుడు.. నిర్మాత.. రచయిత..ఇలా మల్టీ టాలెంటెడ్ ఉన్న ఫర్హాన్ అక్తర్ అంటే తెలియని వారు ఉండరు. బహుముఖ ప్రజ్ఞశాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఫర్హాన్ అక్తర్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితులకు తన మంచి మనసుతో సహాయం చేశారు. వరద బాధితులకు మొబైల్ ఫోన్లు అందించి తనలో ఉన్న సేవా గుణాన్ని చాటుకున్నాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని రాష్ట్రాలు జలమయమైన సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి ఎంతోమంది వరదల్లో కొట్టుకుపోయారు. మరెన్నో కుటుంబాలు వరదల వల్ల సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డాయి. అయితే ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన కొన్ని కుటుంబాలను ఆదుకోవడం కోసం నటుడు, నిర్మాత, దర్శకుడు అయినటువంటి ఫర్హాన్ అక్తర్ తన వంతుగా సహాయం చేశారు.

ఉత్తరాఖండ్ లోని హార్సిల్ , ధరాలి జిల్లాల నివాసితులకు 50 ఫోన్ లను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అయితే ఆకస్మిక వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు జీవనాధారాన్ని, ఇల్లు, వస్తువులు ఇలా ఎన్నో కోల్పోయారు. అయితే ఒక్క ప్రాంతంలో జరిగే విషయాన్ని మరో ప్రాంతం వారు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వారి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కానీ వరదల కారణంగా ఇక్కడి ప్రజలు మొబైల్ ఫోన్లను కూడా కోల్పోవడంతో ఆయన ఆలోచన చేసి హార్సిల్ మరియు ధరాలీ జిల్లాల్లో ఉండే కొంతమందికి దాదాపు 50 ఫోన్ లను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక ఒక్కో ఫోన్ విలువ రూ.7000 ఉంటుందని తెలుస్తోంది. అయితే BDRF ఫౌండేషన్ లో పనిచేసే దివ్యాన్షు ఉపాధ్యాయ్ ఫర్హాన్ అక్తర్ సహాయం కోరడంతో వెంటనే ఆయన స్పందించి.. సుమారు 7000 విలువైన 50 ఫోన్ లను ఇవ్వడానికి ముందుకు వచ్చారట.

అలా BDRF సహాయంతో ఫర్హాన్ అక్తర్ 50 ఫోన్ లను వరద బాధితులకు పంచిపెట్టారు. అయితే ఫర్హాన్ అక్తర్ పంపించిన ఫోన్లు అందుకున్న చాలామంది వరద బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వరదల కారణంగా మేము మా వస్తువులన్నీ కోల్పోయామని, కానీ ఫర్హాన్ గారు చేసిన సహాయంతో మా బంధువుల క్షేమ సమాచారాన్ని మళ్లీ ఈ ఫోన్ ల ద్వారా తెలుసుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. బాధలో ఉన్న మాకు ఇలా భరోసా ఇచ్చి మేమున్నాం అని ఆయన ఓదార్పునివ్వడం చాలా మంచి పరిణామం అంటూ చెప్పుకొస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ ఇచ్చిన ఫోన్ల వల్ల చాలామంది ప్రజలు తమ బంధువుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారని BDRF బృందాలు తెలిపాయి. ఇక ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా చాలామంది గత కొన్ని వారాలుగా ధర్మశాలల్లో నివసిస్తున్నారు.

ఫర్హాన్ అక్తర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ డాన్ 3 మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈయన నిర్మించిన బహదూర్ 120 మూవీ నవంబర్లో విడుదలకు సిద్ధంగా ఉంది.