ఆ డైరెక్టర్ ఇప్పుడు ఆర్డర్ మొత్తం ఛేంజ్!
పర్హాన్ అక్తర్ 'డాన్' ప్రాంచైజీ నుంచి 'డాన్ 3'ని ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించాడో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 3 Jan 2026 5:00 PM ISTపర్హాన్ అక్తర్ 'డాన్' ప్రాంచైజీ నుంచి 'డాన్ 3'ని ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించాడో చెప్పాల్సిన పనిలేదు.ఎంతో మంది హీరోల్ని పరిశీలించి చివరిగా రణవీర్ సింగ్ ని హీరోగా ఎంపిక చేసాడు. అతడికి జోడీని వెతకడానికి పర్హాన్ చాలా సమయం తీసుకున్నాడు. స్టార్ హీరోయిన్లు అందర్నీ స్క్రూట్నీ చేసి చివరిగా కియారా అద్వాణిని లాక్ చేసారు. ఆమె ఇతర సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నా? వెయిట్ చేసి మరి పట్టుబట్టి కియారాను ఎంపిక చేసాడు. అందుకోసం నెలల సమయం కేటాయించి పని చేసాడు. ఒకరేంటి? సినిమాకు ఎంపికైన నటీనటుల అందరి విషయంలో ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తీసుకున్నాడు.
కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించాడు అన్నది ప్రాధమిక సమాచారం. రణవీర్ సింగ్ ఇంత వరకూ ఏ సినిమాకు ఇలా చేయలేదు. ఓ సినిమా కమిట్ అయ్యాడంటే కట్టుబడి పని చేసాడు. జయాపజయాలతో సంబంధం లేకుండానే దర్శకులతో మమేకమై పనిచేసాడు. కానీ పర్హాన్ అక్తర్ విషయంలో ఇద్దరి మధ్య చెడటంతో? సీన్ మొత్తం మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల రణవీర్ సింగ్ కి పెద్దగా నష్టం లేదు. కానీ పర్హాన్ అక్తర్ మాత్రం ఇప్పుడు నానా పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది.
'డాన్ 3'కి సంబంధించి మొత్తం ఆర్డరే మారిపోతుంది అన్నది తాజా సమాచారం. కియారాను ఎంపిక చేయడానికి కారణం రణవీర్ సింగ్ కి సరిజోడి అనే రీజన్ తోనే. సినిమాలో యాక్షన్ సన్నివేశాల పరంగా కియారా పెర్పార్మెన్స్ ఎలా ఉంటుంది? అన్నది అంచనా కూడా వేయకుండా పర్హాన్ ఎంపిక చేసాడు. కానీ ఇప్పుడు రణవీర్ సింగ్ తప్పుకోవడంతో? కియారాను ఈ ప్రాజెక్ట్ కి మినహాయించాలని పర్హాన్ భావిస్తున్నాడట. తాజాగా ఇందులో హీరోగా హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్నారు.
అతడు ఎంపికైతే? హృతిక్ ఇమేజ్, హైట్ వెయిట్ కు తగ్గ నటిని తీసుకురావాలి? ఇంకా సినిమాలో మరికొంత మంది నటులపైనా వేటు పడుతుందనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో జరుగుతోంది. మరి అసలేం జరుగుతుంది? అన్నది ఇంత వరకూ అధికారికంగా మాత్రం ఎలాంటి ధృవీకరణ లేదు. అన్ని సక్రమంగా జరిగి ఉంటే? ఈపాటికి చిత్రం సెట్స్ లో ఉండాలి. కియారా, రణవీర్ సింగ్ కారణంగా ఆలస్యమైనా? జనవరిలో ఇద్దరు డేట్లు ఇవ్వడంతో? ఈ వారంలోనే షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. కానీ తాను ఒకటనుకుంటే? దైవం మరోటి తలిచింది. 'డాన్ 2' తర్వాత పర్హాన్ అక్తర్ కెప్టెన్ కుర్చీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత దర్శకుడిగా పని చేస్తోన్న చిత్రమిది. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ముందుకెళ్తున్నాడు. మరి కొత్త ఏడాదిలో 'డాన్ 3' అధికారిక అప్ డేట్ ఉంటుందా? అన్నది చూడాలి.
